బాలీవుడ్లో వివాహ బంధం కంటే, డేటింగ్ కల్చర్ కి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువగా అక్కడి జంటలని చూస్తూ ఉంటే పెళ్లికి ముందు ఎవరో ఒకరితో డేటింగ్ చేసిన సందర్భాలు కనిపిస్తాయి. అలాగే పెళ్లి అయిన వారు కూడా విడాకులు తీసుకొని కుర్ర హీరోలతో డేటింగ్ చేస్తున్న భామలు ఉన్నారు. వివాహ వ్యవస్థ కంటే అక్కడ సెలబ్రిటీల సహజీవనం  ఎప్పుడు హాట్ టాపిక్ గా  ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఎవరితో రిలేషన్ లో ఉంటారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది.


ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోయిన్ అమీ జాక్సన్ తాను గర్భవతి అనే విషయాన్ని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. నిజానికి ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉంది. అయితే పెళ్లి కాకుండానే తల్లి అయిన కూడా ఈ భామ పెద్దగా భాధపడటం లేదు ఎందుకంటే ఆమె ఇంగ్లాండ్ నేపధ్యం కాబట్టి. అలాగే తాను తల్లి అయిన విషయాన్ని గర్వంగా ప్రపంచానికి చెప్పుకుంది.


ఇదిలా ఉంటే ఇప్పుడు మరో హాట్ కపుల్ పెళ్లి కాకుండానే తల్లిదండ్రులు అవుతున్నారు.  గత సంవత్సరం భార్యకు విడాకులు ఇచ్చి 22 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టిన నటుడు అర్జున్ రాంపాల్. ప్రస్తుతం ఈ హీరో సౌత్ ఆఫ్రికా మోడల్ గాబ్రియాలాతో సహజీవనం చేస్తున్నాడు. గాబ్రియాలా కోసమే భార్యకు రాంపాల్ విడాకులు ఇచ్చాడనే టాక్ బీ టౌన్ లో గట్టిగానే ఉంది. గత ఏడాది కాలంగా సహజీవనం సాగిస్తున్న అర్జున్ రాంపాల్, గాబ్రియాలాలు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు.


తాజాగా ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేశాడు. గాబ్రియాలా గర్బంతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లుగా ప్రకటించాడు. 45ఏళ్ల అర్జున్ రాంపాల్ కి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద అమ్మాయి త్వరలో బాలీవుడ్ తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా ఒక సినిమా కూడా మొదలై షూటింగ్ జరుపుకుంటుంది. కూతురు హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సమయంలో అర్జున్ రాంపాల్ తండ్రి కావడం బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: