టాలీవుడ్‌లో కాంట్ర‌వ‌ర్సీ క్వీన్‌గా మారిపోయిన హాట్ శ్రీరెడ్డి మ‌రోసారి రెచ్చిపోయింది. గ‌త ఏడెనిమిది నెల‌లుగా ఎవ‌రో ఒక‌రిని టార్గెట్‌గా చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన ఈ భామ మ‌రోసారి నేచుర‌ల్ స్టార్ నానిని టార్గెట్‌గా చేసుకుంది. నాని ప్ర‌స్తుతం త‌న తాజా సినిమా జెర్సీ హిట్ మూమెంట్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన జెర్సీకి రివ్యూవ‌ర్ల‌తో పాటు ప్రేక్ష‌కుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. నాని ఈ జోష్‌లో ఉండ‌గానే శ్రీరెడ్డి మ‌రోసారి త‌న నోటికి ప‌ని చెప్పి నానిని ఆడేసుకుంది.


ఇదేం కర్మరా బాబు సినిమాలో నటించినట్లుగా నిజ జీవితంలో కూడా నాని మంచివాడని నమ్ముతున్నారు అంటూ ఓ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి . ఈ పోస్ట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నానిని శ్రీరెడ్డి అలా టార్గెట్ చేసిందో ?  లేదో ? ఇటు నాని ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై విరుచుకుప‌డుతున్నారు. నాని త‌ప్పు చేసిన‌ట్టు నీ ద‌గ్గ‌ర సాక్ష్యాలు ఉంటే భ‌య‌ట‌పెట్టు... అంతే కాని నీ నోటికి వ‌చ్చిన‌ట్టు విమ‌ర్శిస్తే చూస్తూ ఊరుకోం అని శ్రీరెడ్డికి వార్నింగ్‌లు ఇస్తున్నారు.


ఇక నాని అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు ఇండ‌స్ట్రీలో చాలా మందిని టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతూ కొద్ది రోజులుగా వ్యాఖ్య‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా శ్రీరెడ్డి వ్యాఖ్య‌లు మ‌రీ వ‌ల్గ‌ర్‌గా ఉంటున్నాయి. అయినా ఆమె ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. శ్రీ రెడ్డి ఆరోపణలపై నాని లీగల్ గా చర్యలు తీసుకుంటానని ప్రకటించాడు కానీ అది ఎంతవరకు వచ్చిందో మాత్రం తెలీడం లేదు . 



మరింత సమాచారం తెలుసుకోండి: