తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు సూర్య.  తాజాగా సూర్య నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'కప్పాన్‌' మూవీ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ చిత్రంలో సూర్యతో పాటు మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్నారు.   సూర్య ఆయనకు బాడీగార్డ్ గా నటిస్తున్నాడు.  హీరో ఆర్య మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.


స్టూడియో గ్రీన్‌ పతాకంపై అల్లిరాజా సుభాష్‌కరణ్‌, కేఈ జ్ఞానవేల్‌ రాజాలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ‌రీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.  ఆర్య సరసన సాయేషా సైగ‌ల్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌ల‌తో ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

తాజాగా జావా ఐలాండ్‌లో సాంగ్ షూటింగ్ జ‌రిపేందుకు చిత్ర యూనిట్ అక్క‌డికి చేరుకుంది. సూర్య‌, సాయేషాపై రొమాంటిక్ సాంగ్ చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. చిత్రం దేశ‌భక్తి నేప‌థ్యంలో తెర‌కెక్కుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: