ఏపీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సీన్ రివ‌ర్స్ అయ్యిన‌ట్టే. ప‌వ‌న్ జ‌న‌సేన పోలింగ్‌కు ముందే చేతులు ఎత్తేసింది. ప‌వ‌న్ పార్టీ అధికారంలోకి రావ‌డం సంగ‌తి ఏమో గాని... ప‌వ‌న్ పోటీ చేసిన రెండు చోట్ల అయినా గెలుస్తాడా ? అంటే అన్నీ సందేహాలే. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై దాదాపుగా జ‌న‌సేన వ‌ర్గాల‌తో పాటు అంద‌రూ ఓ క్లారిటీకి వ‌చ్చేయ‌డంతో ప‌వ‌న్ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే మ‌ళ్లీ మొఖానికి రంగేసుకోవ‌డం స్టార్ట్ చేస్తాడ‌ని తెలుస్తోంది.


ప‌వ‌న్ గ‌తేడాది సంక్రాంతికి న‌టించిన అజ్ఞాత‌వాసి సినిమా త‌ర్వాత మ‌ళ్లీ సినిమా చేయ‌లేదు. పార్ట్ టైం పొలిటిషీయ‌న్ అన్న విమ‌ర్శ‌లు రావ‌డంతో తాను సినిమాలు ఆపేశాన‌ని... ఇకపై ఫుల్ టైం పొలిటిషీయ‌న్‌గా మారుతున్న‌ట్టు చెప్పాడు. అయితే అప్ప‌టికే ఇద్ద‌రు ముగ్గురు నిర్మాత‌ల ద‌గ్గ‌ర నుంచి అడ్వాన్స్‌లు తీసుకోవ‌డంతో ఆ సినిమాలు పూర్తి చేస్తాడా ?  లేదా ? అన్న సందేహాలు ఉన్నాయి. ఇక ప‌వ‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మ‌ళ్లీ సినిమాలు చేసుకోవ‌డం మిన‌హా అయిదేళ్ల పాటు చేయ‌డానికి పాలిటిక్స్ ఏం ఉండ‌వు.


ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. త‌న‌తో గ‌తంలో చేసిన ఓ డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్ సినిమా ఫిక్స్ చేసేశాడ‌ట‌. గతంలో పవన్ తో గోపాల గోపాల, కాట‌మ‌రాయుడు సినిమాలు చేసిన డాలీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టును సిద్దం చేసారని తెలుస్తోంది. ప‌వ‌న్ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం అటు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు, స‌గ‌టు సినిమా ఫ్యాన్స్‌కు శుభ‌వార్తే అయినా పోయి పోయి ఓ ప్లాప్ డైరెక్ట‌ర్‌తో సినిమా క‌మిట్ అవ్వ‌డం ఏంట్రా ?  బాబూ అని చాలా మంది త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.


గోపాల‌...గోపాల ఓ రీమేక్ అది తెలుగులోనూ అంత గొప్ప ప్రాజెక్టేం కాదు. ఇక కాట‌మ‌రాయుడు రీమేక్‌తో మ‌రోసారి ప‌వ‌న్ డాలీకి ఛాన్స్ ఇవ్వ‌గా అది ఘోర‌మైన డిజాస్ట‌ర్ అయ్యింది. డాలీకి అస‌లు ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టుగా సినిమాలు డైరెక్ట్ చేయ‌డ‌మే తెలియ‌ద‌న్న విమ‌ర్శ కూడా ఉంది. ప‌వ‌న్ త్రివిక్రమ్ డైరక్షన్ లో హారిక హాసినిలో కూడా ఓ సినిమాకు ఓకే చెప్పాడ‌ట‌. ఆ ప్రాజెక్టు చేయ‌కుండా డాలీతో ఎందుకు చేస్తున్నాడో ?  కూడా ఎవ్వ‌రికి అర్థంకావ‌డం లేదు. డాలీ అంటే మ‌ళ్లీ మ‌రో డిజాస్ట‌ర్ ప‌వ‌న్ అక్కౌంట్‌లో ప‌డిన‌ట్టేనా...!



మరింత సమాచారం తెలుసుకోండి: