సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టిస్తోన్న మ‌హ‌ర్షి సినిమా మ‌రో రెండు వారాల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. టాలీవుడ్‌లో సంక్రాంతి త‌ర్వాత ఏ పెద్ద హీరో న‌టించిన సినిమాలు థియేట‌ర్ల‌లోకి రాలేదు. దీంతో బాక్సాఫీస్ అంతా డ‌ల్‌గా ఉంది. పైగా ఎన్నిక‌లు కూడా ఉండ‌డంతో థియేట‌ర్లు అన్ని వెల‌వెల‌బోతున్నాయి. మ‌రోవైపు ఐపీఎల్ ఉండ‌నే ఉండ‌నుంది. ఆ త‌ర్వాత ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ కూడా స్టార్ట్ అవుతుండ‌డంతో ఈ స‌మ్మ‌ర్ టాలీవుడ్‌కు బ్యాడ్ సీజ‌న్‌గానే క‌నిపిస్తోంది. అయితే కొంత కొంత ఊర‌ట‌గా మే 9న మ‌హేష్ మ‌హ‌ర్షి సినిమా థియేట‌ర్ల‌లోకి దిగుతోంది.


మ‌హేష్ మేనియా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోంది. సినిమాపై ఉన్న క్రేజ్‌, అంచ‌నాల నేప‌థ్యంలో మ‌హ‌ర్షి టిక్కెట్ల రేట్ల‌కు రెక్క‌లు వ‌చ్చేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన కారణంగా మహర్షి టికెట్ ధరలను తొలి వారం రోజులు పెంచుకునేలా అనుమ‌తులు ఇవ్వాల‌ని బీ సెంట‌ర్ల‌లోని మ‌ల్టీఫ్లెక్స్ నిర్వాహ‌కులు సైతం క‌లెక్ట‌ర్ల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకుంటున్నారు. బీ సెంట‌ర్ మ‌ల్టీఫ్లెక్స్‌లో రిక్లైన‌ర్ టిక్కెట్ రూ.180 నుంచి 250కు పెంచుతారు. గోల్డ్ క్లాస్ 110 నుంచి 150కు, మూడో త‌ర‌గ‌తి టిక్కెట్ 70 నుంచి 100కు పెంచుతున్నారు.


ఇక ముందు రోజు అర్ధ‌రాత్రి నుంచి బెనిఫిట్ షోలు స‌రేస‌రి. ఇలాంటి అనుమ‌తులు, టిక్కెట్ల రేట్ల పెంప‌కాలు, వారం రోజులు ఐదు షోలు, అర్ధ‌రాత్రి షోలు ఏపీలో కామ‌న్‌. తెలంగాణ‌లోనే వీటిపై ఆంక్ష‌లు ఉన్నాయి. మ‌రి ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్నా వీటికి సాధార‌ణ అనుమ‌తులు ఉంటే చాలు. మ‌రి మ‌హ‌ర్షి విష‌యంలో ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు ఈ వెలుసు బాటు ఇస్తాయో ?  లేదో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: