బాలీవుడ్ లో మలైకా అరోరాతో .. అర్జున్ కపూర్ ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. వీళ్ల ప్రేమకు వీళ్ల ఇళ్లలోని వారి ఆమోదం కూడా పడటంలేదు కానీ.. వీరు తెగించి తిరిగేస్తూ ఉన్నారు. భర్తతో మలైకా విడాకులు జారీ కావడంతోనే వీరిద్దరూ జంటగా తిరగడం మొదలుపెట్టారు. విదేశీ విహారాలు చేపట్టారు. ఇక త్వరలోనే పెళ్లి అనేమాట గట్టిగా వినిపిస్తూ ఉంది.అయితే ఇంతలో ఒకింత ట్విస్ట్ ను ఇచ్చేలా మాట్లాడాడు అర్జున్ కపూర్.


తన పెళ్లికి అప్పుడే తొందర ఏమీలేదని అర్జున్ అంటున్నాడు! 'నాది ఇంకా పెళ్లి చేసుకునే వయసు కాదు..' అనేది ఈ ముప్పై మూడేళ్ల హీరో స్టేట్ మెంట్. ఒకవైపు మలైకా ఆరోరాతో జంటగా విహరిస్తూ, అయితే ఇప్పుడు మాత్రం తనది పెళ్లి చేసుకునే వయసు కాదని అర్జున్ కపూర్ అంటూ ఉండటం విశేషమే. అతిత్వరలో వీళ్ల పెళ్లి అని అంతా అనుకుంటుంటే, అర్జున్ కపూర్ ఇలా మాట్లాడాడు.


మరి అంతా అనుకుంటున్నారు కదా, అంటే.. 'అనుకునే వాళ్లను అనుకోనినవ్వండి.. అది వాళ్ల పని..' అని అర్జున్ కపూర్ వ్యాఖ్యానించాడు. తను మలైకాను పెళ్లి చేసుకోబోతున్నాడనే అంశంపై జరుగుతున్న ప్రచారం తనను పెద్దగా ఇబ్బంది పెట్టదని కూడా అర్జున్ కపూర్ చెప్పాడు. 'రాసే పని మీ మీడియా వాళ్లది. మీ పని మీరు చేయండి. చదివేపని పాఠకులది. వారి పని వారు చేసుకోవచ్చు. ఎవరు ఏం అనుకున్నా ఇబ్బందిలేదు. అందరికీ అన్నీ అర్థం అవుతూ ఉంటాయి..' అని అర్జున్ కపూర్ వ్యాఖ్యానించాడు! 

మరింత సమాచారం తెలుసుకోండి: