దక్షిణాది సినిమా రంగంలో ఏ పాత్ర ఇచ్చినా దానికి తగిన న్యాయం చేసే నటుడు కమలహాసన్ అని చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కామెంట్లు చేస్తుంటారు. నటనలో నవరసాలను వెండితెరపై పండిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ కొన్ని దశాబ్దాల కాలం నుండి భారతీయ చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక క్రేజ్ ఏర్పరుచుకున్న విలక్షణ విశ్వనటుడు కమలహాసన్ వెండితెరపై ఏ రోల్ పోషించిన అది హైలెట్ అని చాలామంది అంటారు.

Image result for kamal haasan nani

ఈ క్రమంలో తాజాగా కమలహాసన్ నటనను గుర్తుకు తెచ్చే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన న్యాచురల్ స్టార్ నాని వెండితెరపై మంచి నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారని సౌత్ ఇండస్ట్రీ కి చెందిన చాలామంది ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల న్యాచురల్ స్టార్ నాని క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన జెర్సీ సినిమాలో క్రికెటర్గా నటించి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

Image result for kamal haasan nani

ఈ సినిమాలో నాని నటన చూసి చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలు సైతం బహిరంగంగానే తమ అభిప్రాయాన్ని తెలియజేస్తు నాని నటనను ఆకాశానికెత్తేశారు. ఒకసారి నాని కెరియర్ గమనిస్తే రోజురోజుకీ నటనలో పరిణితి చెందుతూ విశ్వనటుడు కమల్ హాసన్ నీ గుర్తు చేస్తున్నారని ...నాని నటన నూ ప్రస్తుతం చూస్తుంటే త్వరలోనే కమలహాసన్ వారసుడు అయిపోయేటట్లు ఉన్నారు అని సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: