'విక్టరీ' వెంకటేష్, 'మెగాప్రిన్స్' వరుణ్ తేజ్ కలిసి నటించిన "ఫ్ 2" చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే..అయితే ఇప్పుడు మరోసారి వెంకీ- వరుణ్ కలవబోతున్నారు.. అయితే వారిద్దరూ కలిసి నటిస్తున్నారు అనుకుంటే పొరపాటే..ప్రపంచవ్యాప్తంగా అల్లావుద్దీన్ - జీని పాత్రలకు ఉన్న క్రేజ్ వేరు.

తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల అవ్వబోతున్న "అల్లావుద్దీన్" చిత్రానికి వెంకీ- వరుణ్ తమ గాత్రలని అరువిచ్చారు. జీని పాత్రకు వెంకీ డబ్బింగ్ చెప్పగా, అల్లావుద్దీన్ కి వరుణ్ గొంతు పలికారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వస్తుండటంతో ఈ వేసవిలో "అల్లావుద్దీన్" పిల్లలని విశేషంగా ఆకట్టుకుంటాడనే విషయంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తోంది.

ఇక "వెంకిమామ" సినిమాతో నాగచైతన్యతో నటిస్తున్న వెంకటేష్ బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో "వాల్మీకి" కి ఒకే చెప్పాడు వరుణ్ ఇద్దరు తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నపటికీ ఈ చిత్రం ద్వారా మరోసారి కలవడం ఫాన్స్ కి ఆనందాన్ని కలిగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: