Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 5:20 pm IST

Menu &Sections

Search

దిల్ రాజు మాట విననంటున్న దర్శకుడు! (ఆర్) ఆ దర్శకుడితో దిల్ రాజుకి విభేదాలు?

దిల్ రాజు మాట విననంటున్న దర్శకుడు! (ఆర్) ఆ దర్శకుడితో దిల్ రాజుకి విభేదాలు?
దిల్ రాజు మాట విననంటున్న దర్శకుడు! (ఆర్) ఆ దర్శకుడితో దిల్ రాజుకి విభేదాలు?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

"96" గతఏడాది తమిళ నాట విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం.  ముఖ్యంగా ఈ చిత్రంలో  విజయ సేతుపతి, త్రిషల నటనకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు,  ఇక ఈ చిత్రాన్ని తెలుగు- తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్- భావనలు జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి "99" అని పేరు పెట్టగా ఈ చిత్రం షూటింగ్ దశను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. 


ఇక తెలుగునాట ఈ చిత్రంలో యువ కధానాయకుడు శర్వానంద్- సమంతలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ ప్రారభించుకుని మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇదిలా ఉండగా ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను మార్పులు చేయమని దిల్ రాజు దర్శకుడికి సూచించినట్టు తెలుస్తుంది,  అయితే దిల్ రాజు చెప్పిన మార్పులు చేస్తే సినిమా ఫీల్ దెబ్బతినే అవకాశముందని దర్శకుడు భావిస్తున్నాడట, ఇక ఈ విషయంపై ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 


నిజానికి దిల్ రాజుకు మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరుంది. తన చిత్రాల వరకు అన్ని దగ్గరుండి చూసుకోవడం దిల్ రాజుకు మొదటినుండి ఉన్న అలవాటు, అలా మార్పులు చేసిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి..మరి  దిల్ రాజు నిర్ణయాలని ప్రేమ్ కుమార్ వింటాడో లేక తనకి నచ్చినట్టే నడుచుకుంటాడో తెలియాలంటే కొంతకాలం వరకు వేచి చూడాల్సిందే.

96-movie-remake-jaanu-golden-star-ganesh-bhavana-p
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

I am a Computer Engineer but my interests are getting to know about the updates in my favourite areas.I am a good fashion designer.Surfing net is my prime hobby