పవన్ కళ్యాణ్ కున్న రియల్ పవరేంటో ఇప్పడు అందరికి తెలిసిపోయింది. ఆయనకు ఆయన అభిమానులే కాదు, అందరి అభిమానులు కూడా ప్రాణం ఇస్తారని తెలిసిపోయింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ విడుదలయిందన్న వార్తలు వెలబడ్డ మరుక్షణం పవన్ కు అందరు బాసటగా నిలిచారు.

అనుమానం ఉన్న ప్రాంతాలలో పవన్ అభిమానులే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా రంగంలోకి దిగి పైరసీ సిడీలు పట్టుకునేందుకు ఊరువాడా  తిరిగారు. స్థానిక పోలీసులకు వెంటది వెంట సమాచారమిచ్చి సదరు పైరసీ భూతాన్ని తరిమికొట్టేందుకు ఇలా అందరు కలిసి ముందుకు రావడం కూడా టాలీవుడ్ కు మంచి శకునమే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: