నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన లేటెస్ట్ సినిమా జెర్సీ. క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గ‌త వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన జెర్సీకి ప్రేక్ష‌కుల‌తో పాటు రివ్యూవ‌ర్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే అదే రోజు రాఘ‌వ లారెన్స్ కాంచ‌న‌-3 సినిమా కూడా రావ‌డం, ఆ సినిమా బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ కావ‌డంతో ఆ ప్ర‌భావం జెర్సీ వ‌సూళ్ల‌పై గ‌ట్టిగా ప‌డింది. తొలి వారం ముగిసే స‌రికి జెర్సీ రూ.21 కోట్ల షేర్ రాబ‌ట్టింది.


ఇక కాంచ‌న 3 తొలి వారం ముగిసేస‌రికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.100 కోట్ల వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్మురేపుతుంటే నాని వ‌సూళ్ల ప‌రంగా వెన‌క‌ప‌డిపోయాడు. ఇక ఈ వీక్ నుంచి హాలీవుడ్ సినిమా ఎవెంజెర్స్ దాడి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స్టార్ట్ అవ్వ‌డంతో జెర్సీకి రెండో వారంలో వ‌సూళ్లు అంత ఆశాజ‌న‌కంగా ఉండేలా లేవు. ఇలా జెర్సీకి దెబ్బ మీద దెబ్బ‌లు ప‌డ్డాయి. ఇక జెర్సీ ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్లు రాబ‌ట్టింది. అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసిన నాని సినిమాల్లో జెర్సీ ఆరో సినిమా. ఈ  సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. అనిరుధ్‌ బాణీలు అందించారు.


' జెర్సీ '  ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ (రూ.కోట్ల‌లో)
నైజాం -  6.74
సీడెడ్  - 1.38
నెల్లూరు  - 0.50
కృష్ణా - 1.09
గుంటూరు - 1.13
వైజాగ్  - 1.75
ఈస్ట్ - 1.20
వెస్ట్ -   0.89
--------------------------------- 
ఏపీ + తెలంగాణ =  14.68
--------------------------------- 
ఇతర ప్రాంతాలు                      2.15
ఓవర్సీస్                                4.40
వరల్డ్ వైడ్ షేర్             21.23


మరింత సమాచారం తెలుసుకోండి: