నాగార్జున లుక్ గురించి ఆమధ్య తెగ వార్తలు రావడంతో నాగ్ కు ఏమైంది అంటూ మీడియా సంస్థలు అనేక కథనాలు వ్రాసాయి. అయితే ఆ గాసిప్పుల పై ఎప్పుడూ నాగ్ స్పందించలేదు. ప్రస్తుతం ‘మన్మధుడు 2’ షూటింగ్ కోసం పోర్చుగల్ లో ఉన్న నాగార్జున ఆసినిమా లోని తన ఫ్రష్ లుక్ కోసం పడుతున్న కష్టాన్ని తెలియచేస్తూ కొన్ని ఫోటోలు అదేవిధంగా ఒక వీడియో తన ట్విటర్ లో షేర్ చేసాడు. 

ఈవీదియోలో ఒక జిమ్ లో నాగార్జున తన బాడీ ఫిట్నెస్ కోసం ఎక్స్ సైజ్ లు చేస్తుంటే ఈమూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఆ జిమ్ లోకి వచ్చి ‘సార్ షూటింగ్ కు టైమ్ అయింది’ అంటూ ఖంగారు పెడతాడు. అంతేకాదు అదే జిమ్ లో నాగ్ తో కలిసి జిమ్ చేస్తున్న రకుల్ ను చూసి ‘నీకు మళ్ళీ వేరుగా చెప్పాలా’ అంటూ జోక్ చేస్తాడు. 

అయితే నాగార్జున వెంటనే నవ్వుతు రకుల్ తన లుక్ ను మార్చుకోవడానికి మరింత కష్టపడుతోంది అని చెపుతూ తాను ముందుగా రెడీ అయి షూటింగ్ కు వస్తానని ఆతరువాత రకుల్ వస్తుందనీ ఆమెను టార్చర్ పెట్టవద్దు అని జోక్ చేస్తాడు. నాగ్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. 

కొన్ని రోజుల క్రితం రకుల్ లుక్ పై నాగార్జున అదేవిధంగా రాహుల్ రవీంద్రన్ అసంతృప్తి వ్యక్తం చేసారు అన్న గాసిప్పులు హడావిడి చేసాయి. ఇప్పుడు ఆ గాసిప్పులకు సమాధానంగా రకుల్ ఈసినిమా కోసం ఎంత కష్టపడుతోందో చెప్పడానికి నాగ్ ఈవిధంగా ఏకంగా ఇజ్రాయిల్ నుండి ఈ వీడియో షేర్ చేసి ఉంటాడు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ స్పాట్ నుండి లీక్ అవుతున్న నాగ్ లుక్ కు సంబంధించిన ఫోటోలు చూస్తూ ఉంటే నాగార్జున వయస్సు మరో పది సంవత్సరాలు వెనక్కు వెళ్ళిందా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: