సన్నీలియోన్‌.. హాట్ తారగానే ప్రజలకు సుపరిచితం.. గతంలో నీలి చిత్రాల్లో నటించిన ఈ అందగత్తె.. ఆ తర్వాత బాలీవుడ్‌లో తనకంటూ సొంత ఇమేజ్ సంపాదించింది. ఆ తర్వాత ఐటమ్ సాంగ్స్ ద్వారా కూడా వివిధ భాషల ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. 


అందుకే సన్నీలియోన్ అనగానే ఆ దృష్టితో చూసేవారే ఎక్కువ. కానీ తనలోనూ ఓ మానవీయమూర్తి ఉందని ఈ తార నిరూపించింది. తనతో పనిచేసే ఓ ఆర్టిస్ట్ కష్టాల్లో ఉంటే ఆదుకోలేకపోయానంటూ ఆమె ఇటీవల ఓ షో కంటతడి పెట్టింది. 

వివరాల్లోకి వెళ్తే... తన అసిస్టెంట్ మరియు కోఆర్టిస్ట్ ప్రభాకర్‌కు గతేడాది రెండు కిడ్నీలు పాడైపోయాయి. కేవలం 20 శాతమే పనిచేస్తున్నాని సన్నీలియోన్ కు తెలిసింది. తాను కొంత ఆర్థిక సాయం చేసి.. ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 

కానీ పోస్ట్ పైనా ట్రోలింగ్ నడిచిందట. ఇంత జరిగినా ప్రభాకర్ ను మాత్రం కాపాడుకోలేకపోయామంటూ సన్నీలియోన్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుంది. సహచరుడిని బతికించుకోవాలన్న ఆమె తాపత్రయం.. అలా కాపాడుకోలేకపోయానన్న ఆమె ఆవేదన అందర్నీ కదిలించాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: