తెలుగు ఇండస్ట్రీలో ఆ మద్య ఒకే నెలలో ప్రముఖ దర్శకులు, నిర్మాతలు విజయబాపినీడు, కోడి రామకృష్ణ కన్ను మూశారు.  ఆ విషాదం మర్చిపోక ముందే..మరో ప్రముఖ నిర్మాత కోనేరు అనిల్‌ కుమార్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అనిల్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.


హీరో శ్రీకాంత్ కు సన్నిహితుడైన అనిల్ కుమార్ ఎన్నో హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘అల్లరి బుల్లోడు’, బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధా గోపాళం’తో పాటు ‘ఒట్టేసి చెబుతున్నా’ తదితర చిత్రాలకు అనిల్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. అనిల్ కుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.  


అలాగే నితిన్‌, త్రిష, రతి జంటగా నటించిన అల్లరి బుల్లోడు చిత్రానికి  రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. అనిల్ కుమార్ స్వగ్రామం చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామం. ఆయన మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: