బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అంటే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతారు.  నటించిన చిత్రాలు కొన్నే అయిన తన సంచలన వ్యాఖ్యలతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది.  అయితే ఈ అమ్మడిపై ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకోవడం విశేషం.  గతంలో నందమూరి బాలకృష్ణ సరసన రెండు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే తెలుగు ఇండస్ట్రీలో హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని..హీరోయిన్లను డమ్మీలుగా, కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటారని సంచలన కామెంట్ చేసింది.  ఆ మద్య రజినీకాంత్ నటించిన ‘కబాలి’చిత్రంలో చాన్స్ కొట్టేసింది.  


తెలుగు,తమిళ, హిందీ ఇండస్ట్రీలో మంచి ఛాస్సులు దక్కించుకుంటున్న రాధికా ఆప్టే ప్రస్తుతం  'ది ఆశ్రమ్'..'ది వెడ్డింగ్  గెస్ట్' అనే ఇంగ్లీష్ చిత్రాల్లో నటిస్తుంది.  తాజాగా ఈ బ్యూటీ 'పేపర్' అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసింది. ఈ డ్రెస్ గురించి కూడా రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.  ఒక మెరూన్ కలర్ థై స్లిట్ గౌన్ ధరించి అందాలరాణిలా రెండు చేతులను నడుముపై హాట్ లుక్ తో ఎద అందాలను చూపిస్తుంది. డ్రెస్ ను చూస్తుంటే కేన్స్ ఫెస్టివల్స్ లో అందాల ముద్దుగుమ్మలు వేసుకునేలా ఉంది. 


అయితే ఈ ఫోటో చూసి నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.  "సడెన్ గా చూసి ఐశ్వర్య రాయ్ అనుకున్నా" అన్నాడు. మరో నెటిజనుడు "దయచేసి టెంపరేచర్లు పెంచొద్దు ప్లీజ్" అన్నాడు.  మొత్తానికి ఈ అమ్మడు వెండి తెరపై కన్నా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: