అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ‘విక్రమ్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదట్లో పెద్దగా విజయాలు అందుకోలేకపోయారు.  వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’చిత్రం నాగార్జున కెరీర్ ని ఎక్కడికో తీసుకు వెల్లింది.  అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకుపోయారు.  మొదట్లో యాక్షన్ తరహా చిత్రాల్లో నటించిన నాగార్జున ‘గీతాంజలి’చిత్రంతో లవర్ బాయ్ గా మారారు.  ఆ తర్వాత కొన్ని ఫ్యామిలీ తరహా చిత్రాల్లో నటించారు.  మన్మధుడు చిత్రం నాగార్జున కెరీర్ లో మరువలేని చిత్రంగా మిగిలిపోయింది. 

ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే.  రాహూల్ రవింద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ఇండస్ట్రీలో నాగార్జున ఇప్పటికీ నవ మన్మధుడిగానే కనిపిస్తుంటారు. ఆయన తనయులు ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్నా..ఆయనలో మాత్రం ఇంకా హీరోయిజం ఎక్కడికీ పోలేదు.  అయితే తన ఆరోగ్య హస్యం ఎప్పుడు ఉల్లాసంగా ఉండటం..మంచి ఆహారపు అలవాట్లు..ఎలాంటి టెన్షన్లు తీసుకోకపోవడం అని అంటుంటారు.   

తినే తిండి.. కసరత్తులు.. యోగా ప్రతిదీ టైమ్ ప్రకారం మెయింటెయిన్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో పాతికేళ్ల నవమన్మధుడిగా కనిపించేందుకు కింగ్ చేస్తున్న కఠోర శ్రమ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. ఇటీవలే  చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ స్ట్రెచింగ్ బెల్ట్ తో కసరత్తులు చేసిన నాగార్జునను చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. 

తాజాగా పోర్చుగల్ షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు నిన్నటిరోజున మీడియా గ్రూపుల్లోకి వచ్చాయి.   ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే..చెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం వెయిట్ చేసి ముదిరిపోయిన బ్రహ్మచారిగా నాగార్జున నటిస్తున్నారు నాగార్జున.   ఈ  చిత్రంలో ప్రతి సీన్ కామెడీతో పొట్ట చెక్కలయ్యేలా ఉంటాయట.  రకుల్ ప్రీత్ ఈ చిత్రంలో నాగార్జునతో పోటీ పడి మరీ నటిస్తున్నారని టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: