టాలీవుడ్‌లో మంచి హిట్ల‌తో ఫామ్‌లో ఉన్న ఓ యంగ్ హీరో రాస‌లీల‌ల గుట్టు ఇప్పుడు ఓ నిర్మాత చేతిలో ఉన్న‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వార్త‌లు ఒక్క‌టే గుప్పుమంటున్నాయి. ఆ యంగ్ హీరో త‌ర‌చూ షూటింగ్లో ఏ మాత్రం గ్యాప్ వ‌చ్చినా గోవా చెక్కేస్తుంటాడు. అక్క‌డ ప‌లువురు హీరోయిన్ల‌తో పాటు మోడ‌ల్స్‌తో ఫుల్లుగా ఎంజాయ్ చేయ‌డం అల‌వాటుగా చేసుకున్నాడు.


గోవాలో స‌ద‌రు హీరో  తాగిన మైకంలో ఏమేం చేస్తున్నాడో కూడా వీడియో చేసుకుని మ‌రీ ఎంజాయ్ చేసేవాడ‌ట‌. ఆ ఎంజాయ్ తాలూకు మొత్తాన్ని ఫోటోలు , అలాగే వీడియోలు తీసుకొని చూడటం అత‌డికి అలవాటుగా మారింది. ఇప్పుడు అదే అత‌డి పాలిట శాపంగా మారింది. పలువురు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసుకున్న వీడియోలు ఇప్పుడు ఓ నిర్మాత చేతికి చిక్కాయట.


ఇంకేముందు ఆ వీడియోలు చూసి షాక్ అయిన నిర్మాత ఆ యంగ్ హీరోకు ఫోన్ చేసి ఏరా తెర‌మీద నీతులు చెప్పే నువ్వు ఇంత దారుణంగా బిహేవ‌ర్ చేస్తున్నావా ?  నీ రాస‌లీల‌ల వీడియోల గుట్టు మొత్తం నా చేతుల్లోనే ఉంద‌ని చెప్పాడ‌ట‌. ముందుగా స‌ద‌రు నిర్మాత‌పై అలాంటి వీడియోలు లేవు.. ఏం చేస్తావో చేసుకో అని ఫైర్ అయిన స‌ద‌రు హీరోకు ఆ నిర్మాత వివ‌రాల‌తో స‌హా చెప్పేస‌రికి చెవుల పిల్లిలా నిర్మాత ద‌గ్గ‌ర చేతులు క‌ట్టుకుని ఉంటున్న‌ట్టు టాక్‌.


ఏదేమైనా స‌ద‌రు యంగ్ హీరో ఎంజాయ్ చేసిన‌ప్పుడు వీడియోలు తీసుకోవ‌డం ఎందుకు ?  వాటిని తానే చూస్తూ ఎంజాయ్ చేయ‌డం ఎందుకు ?  ఇప్పుడు ఇలా బుక్ అయ్యి బాధ‌ప‌డ‌డం ఏంటో ?  అత‌డికే తెలియాలి. ఇక ఈ హీరో వీడియోల టాక్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: