భారతీయ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి భారీ విజయం తర్వాత తెరకెక్కుతున్న ‘RRR’ సినిమాపై ఇండియన్ ఫిలిం ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసి దర్శకుడు రాజమౌళి సన్నివేశాలు తీయటంలో రాజమౌళి కి మించిన వారు లేరని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.

Image result for rrr movie

ఇప్పటి వరకు తాను తీసిన ప్రతి సినిమాలో మాస్ ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టు ఏదో ఒక ఫైట్ సినిమాకే హైలెట్ అయ్యేటట్టు చూసుకుంటారు రాజమౌళి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ముందుండే ఎన్టీఆర్ చరణ్ తో కలిసి సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఒక భారీ ఫైట్ సీన్ రాజమౌళి తీయబోతున్నట్లు ఇండస్ట్రీలో వస్తున్న టాక్.

Image result for rrr movie

'మగధీర', 'బాహుబలి' సినిమాలలో యుద్ద సన్నివేశాలకు సంబంధించిన ఫైట్ సీన్ కంటే వీరిద్దరూ కలిసి చేయబోయే ఫైట్ సీన్ ఈ సినిమాకే హైలెట్ అని...ఈ ఒక్క ఫైట్ సన్నివేశానికే రాజమౌళి దాదాపు చాలా ఖర్చు చేయనున్నట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. మొత్తంమీద చూసుకుంటే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ సినిమాలో అదిరిపోయే ఫైట్ సీన్ మాస్ ప్రేక్షకుల కోసం రాజమౌళి ఫుల్ మీల్స్ పెట్టేటట్లు తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న ఒక వార్త.



మరింత సమాచారం తెలుసుకోండి: