కోస్తా జిల్లాలలో ముఖ్యంగా కృష్ణ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో జగన్ పవన్ ల గెలుపు పై వేల కోట్లల్లో కొనసాగుతున్న ఎన్నారైల పందెం రాయుళ్ళ వార్తల హడావిడి హాట్ న్యూస్ గా మారిపోయింది. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 25 రోజులు సమయం ఉన్నా ఈసారి ఏకంగా వేదేసాలలో ఉండే ఎన్నారైలు తమ బందు మిత్రుల ద్వారా కోస్తా జిల్లాలలో కొనసాగిస్తున్న కోట్లలలో పందాల వార్తలతో మీడియా హోరెత్తి పోతోంది. 

ఎన్నికల తరువాత పందాలు జరగడం సర్వసాధారణమైన విషయమే అయినా ఈసారి ఏకంగా ఈ పందాల పట్ల ఎన్నారైలు ఆసక్తి కనపరచడం అత్యంత ఆసక్తికరంగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు చాలామంది ఎన్నారైలు ఈ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో 120 నుండి 130 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి అన్న విషయం పై అదేవిధంగా పవన్ కు గాజువాకలో వచ్చే మెజారిటీ పై ఎక్కువగా బెట్టింగ్ లు నడుస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ మ్యానియా విపరీతంగా పెరిగిపోవడంతో కొందరు ఏకంగా కోటి రూపాయల బెట్టింగ్‌ లు కూడ పెడుతున్నట్లు సమాచారం. దీనికితోడు అనూహ్యంగా నర్సాపురం పురం నుండి పోటీ చేసిన నాగబాబు గెలుపు పై కూడ పందాలు జరుగుతూ ఉండటం మరింత షాక్ ఇస్తోంది. సాధారణంగా పవన్‌కళ్యాణ్‌ గెలుపు ఓటమిల పై పందాలు జరగడం సర్వసాధారణం. 

కానీ ఈమ్యానియాలో నాగబాబు వచ్చి చేరడం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. కేవలం నగదు రూపంగానే కాకుండా పొలాలు ఇళ్ళు వంటి స్థిరాస్థుల రూపంలో ఈ బెట్టింగ్ లు జరుగుతూ కొందరు ఏకంగా ఎగ్రిమెంట్లు కూడ వ్రాసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా గోదావరి జిల్లాల్లో ఇలాంటి బెట్టింగ్ లు సంక్రాంతి కోడి పందాల విషయంలో క్రికెట్ విషయంలో జరుగుతూ ఉంటాయి. అయితే ఆ స్థాయికి మించి ఎవరూ ఊహించని రీతిలో జరుగుతున్న ఈ బెట్టింగ్ మ్యానియా వల్ల అనేక కుటుంబాలు నష్టపోతాయి అని అందరూ హెచ్చరికలు ఇస్తున్నా పట్టించుకునే స్థితిలో ఎవరు లేకపోవడం షాకింగ్ న్యూస్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: