వివాదం, సంచలనం లేనిదే  రామ్‌ గోపాల్ వర్మ ఉండడు అంటే అతిశయోక్తి లేదేమో, నిత్యం ఎదో ఒక వివాదంతో సంచలనాలను సృష్టించడం వర్మకు అలవాటే..  తాజాగా "లక్ష్మీస్ ఎన్టీఆర్‌" చిత్రంతో మరోమారు వివాదానికి తెరలేపుతున్నారు వర్మ.  లక్ష్మి పార్వతి -ఎన్టీఆర్ ల మధ్య ఉన్న బంధాన్ని నేపధ్యంగా వర్మ తెరకెక్కిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్‌". ఈ చిత్రం గత నెలలో తెలంగాణలో విడుదల అవ్వగా కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ  చిత్రం ఆంధ్రలో వాయిదా పడింది. 

ఈమధ్యనే  చిత్రాన్ని మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేస్తామని  వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.  విడుదల తేదీ సమీపిస్తుండటంతో  ఏపీలో "లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ "  చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా  ఆదివారం రోజున విజయవాడ నోవాటెల్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహిస్తున్నట్టు వర్మ ప్రకటించారు. అయితే కొన్ని రాజకీయ ఒత్తిడుల వాళ్ళ  నోవొటెల్ వాళ్ళు  వర్మ ప్రెస్ మీట్ ను క్యాన్సిల్ చేశారు.  ఈ విషయంపై మండిపడ్డ వర్మ తన  ప్రెస్ మీట్లను  ను విజయవాడ పైపుల రోడ్డులో  మరియు ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గర నడి రోడ్డు మీద నిర్వహించనున్నట్టు వర్మ ట్విటర్‌లో తెలిపారు.

. "నోవాటెల్‌ హోటల్‌ వాళ్లకు ఎవరో వార్నింగ్‌ ఇవ్వడం వల్ల భయంతో వారు ఈ ప్రోగ్రామ్‌ క్యానిల్‌ చేశారు.  ఒక వ్యక్తికి భయపడి  హోటళ్లు, క్లబ్బులవారు జడిసి పోయారు వారు ఎంత ట్రై చేసినా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నడిరోడ్డుపై జరిగే తన ప్రెస్ మీట్ ను అడ్డుకోలేర" ని  ట్విట్టర్ దారా పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: