అపుడే పాతికేళ్ళు నిండిపోయాయ అనిపించక మానదు. యమలీల పేరిట ఎస్వీ క్రిష్ణారెడ్డి చేసిన ప్రయోగం కోట్లాది రూపాయ‌లను తీసుకువచ్చినిది. 1994లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మూవీలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అసలు స్టార్ కాస్టింగ్ లేకుండా మూవీ తీసి ఇంత పెద్ద హిట్ కొట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.


అప్పట్లో ఆలీ కమెడియన్ గా ఉంటున్నాడు. ఐతే ఆలీకి ఎటువంటి ఇమేజ్ కమేడియన్ గా కూడా లేదు. ఇక అప్పటికే క్రిష్ణారెడ్డి రాజేంద్రప్రసాద్ తో రెండు మూడు హిట్లు కొట్టి ఉన్నారు. ఆయన యమలీల సినిమా అనౌన్స్ చేశారు. హీరోగా అలీ అన్నారు. దాంతో అంతా షాక్ తిన్నారు. ఇది వర్కౌట్ అవుతుందా అని కూడా డౌట్లు పెట్టారు. అయితే కధను, తన టాలెంట్ ని నమ్ముకున్న క్రిష్ణారెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గకుండా యమలీల తీశారు. ఇది మ‌దర్ సెంటిమెంట్ తో పాటు యముడి సెంటిమెంట్ ముడిపెట్టి తీసిన సినిమా కావడంతో జనాలను బాగా పట్టేసింది.


ఏప్రిల్ 28 1994లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని  రికార్డులను బ్రేక్ చేసేసింది. ఆ తరువాత ఆలీ సూపర్ హీరో అయిపోయాడు. ఎన్నో మూవీస్ హీరోగా ఆలీ చేశాడు కూడా. ఇక ఈ మూవీలో సూప‌ర్ స్టార్ క్రిష్ణ  ఓ సాంగ్ లో జుంబారే అంటూ మెరుస్తారు. అది టాప్ హిట్. అలాగే మంజుభార్గవి మదర్ గా బాగా వేసింది. ఇంద్రజ ఇంట్రడ్క్షన్ మూవీ ఇది. దాంతో ఆమెకి కూడా గొప్ప అవకాశాలు వచ్చాయి. మొత్తానికి యమలీల సెన్సేషనల్ హిట్ కొట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: