బాక్సాఫీస్ కి వారూ వీరూ అన్న తేడా లేదు. ఎవరు వచ్చినా స్వాగతం అంటుంది. కాసుల గలగలలే ముఖ్యం. అంతే తప్ప భాషా భేదం ఏం లేదు, దాంతోనే ఇపుడు అసలు తంటా వచ్చిపడుతోంది. ఈ ఏడాది అసలే దారుణం అనుకుంటే  సమ్మర్ లో పొనీలే కాస్తా మంచి రోజులు వచ్చాయని సంబర పడినంతసేపు పట్టలేదు. టాలీవుడ్ బాక్స్ కి బాగా షాక్ కొట్టేసిందిపుడు.


ఈ సమ్మర్ కి మొదట వచ్చిన మూవీ మజిలీ, నాగ చైతన్య ఫెయిల్యూర్ కధకు కాస్తా కామా పెట్టింది. పరవాలేదు మూవీ అనుకున్నారంతా. డబ్బులు కూడా బాగానే వచ్చాయి. ఇంతలో ఆరు ఫ్లాప్స్ తో అల్లాడుతున్న సాయి తేజ్ ఆకలి తీర్చేలా చిత్రలహరి ఓ మాదిరి కలెక్షన్లను రాబట్టింది. అదలా ఉండగానే నాచురల్ స్టార్ నాని జెర్సీ మూవీ రిలీజ్ అయింది. టాక్ అధ్బుతంగా వచ్చింది. ఇక వంద కోట్ల మార్కే అని అంతా వూహించిన వేళ అనూహ్యంగా కలెక్షన్లు ఒక్కసారిగా  డ్రాప్ అయ్యాయి.


దానికి కారణం కాంచన -3 మూవీ. డబ్బింగ్ మూవీగా వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ ఐపోయింది. చూస్తుండగానే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.  పులి మీద పుట్రలా ఎవెంజెర్స్ ఎండ్ గేమ్  వచ్చిపడింది. ఇలా వస్తూనే కలెక్షన్ల సునామీ స్రుష్టిస్తోంది. దాంతో అచ్చ తెలుగు సినిమాలు, స్ట్రైట్  మూవీస్ డల్ అయిపోయాయి. అంటే టాలీవుడ్ జాతకం ఎలా ఉందంటే మంచి సినిమాలు వచ్చినా కూడా కాసులు రాలని దుస్థితి అన్న మాట. ఇక మహర్షి  మూవీ అయినా భారీ కలెక్షన్లు రాబడతాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: