జీవితమే ఓ నాటకం అన్నారు మహానుభావులు. ఎక్కడెక్కడ తిరిగినా సొంత గూటికి చేరుకోవడం ప్రక్రుతి ధర్మం. ఇపుడు అదే జరుగుతుందా అన్న చర్చ నడుస్తోంది. దేశాన్ని బాగు చేద్దామన్న ఆలొచనతో చాలా మంది తమ కొలువులు, నెలవులు దాటి ఈ రంగంలో వీరంగం  వేశారు. అయితే ఎవరు ఏమిటన్నది  ఇక్కడ జనం డిసైడ్ చేస్తారు. ఆ తరువాత నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరి మటుకు వారే.



ఆ విధంగా ఆలొచించుకుంటే ఇపుడు జనసేనాని పవన్ కళ్ళముంది కనిపిస్తున్నారు. ఆయన కీలకమైన బాధ్యతలు ఈ ఎన్నికల్లో ప్రజలు అప్పగిస్తారని ఆశించి జనసేన తరఫున  పోటీ చేశారు. ఇపుడున్న సర్వేల ప్రకారం  అయితే పవన్ పార్టీ అంత ప్రభావం చూపించదు అన్న మాట వినిపిస్తోంది. అదే కనుక జరిగితే మళ్ళీ అయిదేళ్ల పాటు వ్యాపకం ఉండాలి కాబట్టి పవన్ సినిమాలు చేసుకోవడానికే ప్రయారిటీ ఇస్తారన్న మాట వినిపిస్తోంది.



ఇక ఎపుడో 2007లో సినిమాలకు స్వస్తి వాచకం పలికేసిన విజయశాంతి ఇపుడు ఆశ్చర్యకరంగా సినిమాల వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ఆమె మహేష్ అనిల్ రావిపూడి మూవీలో కీలకమైన పాత్ర పోషించేందుకు రెడీ అంటున్నారుట. ఆమె సైతం రాజకీయంగా ఏమంతా సేఫ్ జేన్లో లేరు. దాంతో ఈ మూవీ హిట్ అయితే విజయశాంతి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినా వింతేమీ లేదని అంటున్నారు.


ఇక తమిళనాడుతో కమల్ హాసం పార్టీ పెట్టి తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ ఆశించిన పరిస్థితి ఐతే ఆయనకు లేదని అంటున్నారు. దాంతో కమల్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతారని అంటున్నారు. బెంగుళూరు నుంచి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ గెలిస్తే ఎంపీ అవుతారు. లేకపోతే సినిమాలు చేసుకుంటారంటున్నారు. ఇక రజనీకాంత్ ఇపుడు అందరి ద్రుష్టిలో ఉన్నారు. ఆయన వేగంగా సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిధ్ధం చేసుకుంటున్నారు. ఇదీ ప్రస్తుతం సినిమా స్టార్ల పరిస్థితి.


మరింత సమాచారం తెలుసుకోండి: