‘మహర్షి’ ఎడిటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు మూడు రోజులలో సెన్సార్ కార్యక్రమాలు కూడ పూర్తి అవుతాయి అని అంటున్నారు. ఈసినిమాకు సంబంధించి బయట ప్రచారంలో ఉన్న కథకు ‘మహర్షి’ మూవీ కథకు చాల వ్యత్యాసం ఉంది అని అంటున్నారు. ఈసినిమా కథలో అల్లరి నరేష్ పాత్ర కీలకం అనీ అతడికోసమే మహేష్ అమెరికా నుండి ఇండియాకు వచ్చి ఇక్కడ రైతుల పరిస్థితి చూసి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాడని అంటూ ఈమూవీ కథ పై చాల ఊహాగానాలు వచ్చాయి. 

అయితే మహేష్ అసలు పాత్ర వేరు అని తెలుస్తోంది. మహేష్ ఈమూవీలో చాల అగ్రెసివ్ యాటిట్యూడ్ తో ఉంటాడని పేరు డబ్బు తప్ప అతడికి వేరే విషయాలు ఏమి పట్టకుండా సక్సస్ లేని మనిషితో మాట్లాడటం కూడ అనవసరం అన్న భావనతో కనిపిస్తూ ప్రతి రంగంలోనూ సక్సస్ అందుకోవడానికి తపన పడుతూ కనిపించే పాత్ర మహేష్ ది అని తెలుస్తోంది. అయితే అలాంటి ‘రిషి’ పాత్రను ప్రభావితం చేసే ఫ్లాష్ బ్యాక్ ఈసినిమాకు కీలకం అనీ ఆ ఫ్లాష్ బ్యాక్ లో అల్లరి నరేశ్ కనిపించేది కేవలం 20 నిముషాలు మాత్రమే అని అంటున్నారు.

చదువులో సక్సస్ వ్యాపారంలో సక్సస్ ఇలా ప్రతి రంగంలో సక్సెస్ తప్ప మరో పదం ఎరుగని మహేష్ పాత్రకు జీవితంలో సక్సస్ మాత్రమే ఒక అంశం కాదు అన్న జ్ఞానోదయం కలిగించే సీన్స్ లో మహేష్ నటన చూసినవారు విపరీతంగా కనెక్ట్ అవుతారని అంటున్నారు. ముఖ్యంగా ఈమూవీలో వచ్చే పదునైన సంభాషణలు అందర్నీ చాల ఆలోచింపచేసేవిగా ఉంటాయని లీకులు వస్తున్నాయి.

అంతేకాదు ఈమూవీ మహేష్ బాబు కెరియర్ లో అతడి నటనకు సంబంధించి మరో మెట్టు ఎక్కించే పాత్రగా రిషి పాత్ర ఉంటుందని ఈమూవీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర చూసిన వారి నుండి లీకులు బయటకు వస్తున్నాయి. అయితే ఈమూవీ కథ విషయంలో ఎంత వెరైటీ ఉన్నా ఈమూవీ పాటలు ఏమాత్రం క్లిక్ అవ్వకపోవడంతో ఆ లోటును
మరిపించే స్థాయిలో ‘మహర్షి’ కథ ఉంటుందా అన్నదే అర్ధంకాని ప్రశ్న.. 


మరింత సమాచారం తెలుసుకోండి: