తమిళ స్టార్ హీరో విశాల్ కి మరోసారి ఘోర అవమానం జరిగింది.  గత కొంత కాలంగా ఆయనకు తమిళనాట నిర్మత మండలి వల్ల ఎన్నో సమస్యలు ఎదురువుతూనే ఉన్నాయి. తమిళ చిత్ర పరిశ్రమలో విశాల్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. సినిమాల సంగతి ఫర్వాలేదు కానీ, పరిశ్రమకు చెందని రాజకీయాల్లో మాత్రం విశాల్ కు ఏదీ కలిసిరావడంలేదు. నడిఘర్ సంఘం అధ్యక్షుడి ఎన్నికైనప్పటి నుంచి ఆయనకు కష్టాలు ఎదుర్కొంటునే ఉన్నారు. తాజాగా మరోసారి ఆయనకు మరోసారి అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న తమిళ నిర్మాతల మండలిని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఇకమీదట నిర్మాతల మండలి కార్యకలాపాలను ఎన్.శేఖర్ పర్యవేక్షిస్తారంటూ తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. 

ఆ మద్య పెద్ద సినిమాలకే ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారని నిర్మాత మండలి కేసు ఫైల్ చేశారు.   ఆనాటి నుంచి నిర్మాత మండలికి ఆయనుకు మద్య వివాదాలు నడుస్తునే ఉన్నాయి. కాగా,   విశాల్ అధ్యక్షుడిగా ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో  కొంతకాలం కిందట  రూ.7 కోట్లు ఖర్చు చేశారని, దీనికి సరైన లెక్కలు చూపడంలేదని మండలిలో సభ్యులే ప్రశ్నించడంతో వివాదం మొదలైంది.  ఆ తర్వాత ఆయన ఆఫీస్ కి తాళం వేశారు. 

తర్వాత విశాల్ తాళం పగుల గొట్టే సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటం...దాంతో, పోలీసు కేసులు, కోర్టు విచారణలతో వ్యవహారం బజారుకెక్కింది. విశాల్ ని అరెస్ట్ చేయడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విశాల్ కార్యవర్గానికి ఇక ఎంత మాత్రం అధికారం లేదని, నిర్మాతల మండలికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తాము నియమించిన ఎన్.శేఖర్ ద్వారానే తీసుకోవాలని స్పష్టం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: