రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ ఆంధ్రలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నగరంలోని నోవాటెల్ లో ఈ మీట్ ను ఏర్పాటు చేయాలని వర్మ తలచినా... హోటల్ యాజమాన్యం అనూహ్యంగా ఆయన బుక్ చేసుకున్న కాన్ఫరెన్స్ హాల్ ను రద్దు చేసింది. దీంతో నగరంలో రద్దీ ప్రాంతమైన ఎన్టీఆర్ సర్కిల్ లోనే బహిరంగంగానే మీడియా సమావేశం పెడతానని వర్మ ప్రకటించారు. దీంతో అలెర్ట్ అయిన బెజవాడ పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా గన్నవరం ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే వర్మను అదుపులోకి తీసుకున్నారు.


ఎయిర్ పోర్టులోనే నిర్భంధించేసి తిరుగు టపాలో హైదరాబాద్ పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు వర్మను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నలు ఉదయించాయి. అయితే వర్మను అరెస్ట్ చేయడానికి గల కారణాలను వివరిస్తూ బెజవాడ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఏముందన్న విషయానికి వస్తే... రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో విజయవాడ నగరపరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ సెక్షన్ 114 సీఆర్పీసీ అమల్లో ఉన్నాయని అందువల్ల ప‍్రెస్మీట్ నిర్వహించుకునేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలట. 


నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహిస్తే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం కూడా ఉండట. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఐబీయమ్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయట. ఇక వర్మ ప్రెస్ మీట్ నిర్వహిస్తే.. నగరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసి శాంతి భద్రతలకు పూర్తిస్థాయిలో విఘాతం ఏర్పడి అశాంతి చెలరేగే అవకాశ ఉందట. ఈ మేరకు పోలీసులకు ముందస్తు సమాచారం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: