టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంత కాలంగా ఏపి ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నారు.   ఆయన నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్ పై ఆంధ్రప్రదేశ్ లో రగడ కొనసాగుతూనే ఉంది.  ఏపిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలో సీఎం చంద్రబాబును కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు మొదటి నుంచి అభ్యంతరం తెలియజేస్తూ వస్తున్నారు..కోర్టుకెక్కారు.  దాంతో ఈ సినిమా ఏపిలో తప్ప తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. 

అప్పటి నుంచి ఏపిలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.    మే 1న ఏపీలో ఈ సినిమా రిలీజవుతుందని.. ఎన్టీఆర్ వెన్నుపోటు వెనుక కుట్రలు ఎలా జరిగాయో తెలుసుకోండి అంటూ ట్విట్టర్లో పిలుపు ఇచ్చాడు.  ఈ నేపథ్యంలో తనను విజయవాడ నుంచి బలవంతంగా పంపించేయడంపై రామ్ గోపాల్ వర్మ మండిపడుతున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వస్తే ఏ కారణాలతో తనను హైదరాబాద్ తిప్పి పంపారో చెప్పాలని నిలదీస్తున్నారు. 

ఈ సందర్భంగా ఆయన చంద్రబాబునాయుడు, విజయవాడ పోలీసులకు తాను 16 ప్రశ్నలు సంధిస్తున్నానని, వాటికి 16 గంటల్లోగా జవాబు చెప్పకపోతే కోర్టుకెళ్లి తన హక్కులు సాధించుకుంటానని హెచ్చరించారు. ఈ సందర్భంగా వర్మ   తన 16 ప్రశ్నలను ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు చేశారు.  నా కారు ఆపాల్సిన అవసరం ఏంటి? తమకు ఆదేశాలున్నాయని పోలీసులు అంటున్నారు, ఆ ఆదేశాలు ఎవరిచ్చారో చెప్పాలి? వంటి ప్రశ్నలు తన పోస్టులో ప్రస్తావించారు

మరింత సమాచారం తెలుసుకోండి: