మోహన్ కృష్ణ ఇంద్రగంటి తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసందే.  పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు,  అదితి రావ్ హయతి, నివేతా థామస్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మొదట "వ్యూయాం" అనే టైటిల్ ని మొదట అనుకున్న "వి" అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక "వి" అనే టైటిల్ తో ఈరోజు ఉదయం ఈ చిత్ర లోగో విడుదల చేశారు.
ఇక ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.  అయితే ఈ చిత్రంలో సుధీర్ బాబుతో పాటు నాని ముఖ్యపాత్రలో నటిస్తున్నాడని అంతా అనుకున్నారు, అయితే ఇవాళ విడుదల చేసిన టైటిల్ లోగోలో  నాని పేరు లేకపోవడంతో నాని అభిమానులు షాక్ కి గురయ్యారు. అఫిషియల్ గా విడుదల చేసిన పోస్టర్ లో నాని పేరు లేకపోవడంతో ఇక నాని ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టుగానే కనిపిస్తుంది.
స్వతహాగా ఇంద్రగంటి అంటే నానికి ప్రత్యేక అభిమానం అలానే "ఎంసీఏ" "నేనులోకల్" చిత్రాలతో దిల్ రాజు నానికి కమెర్షియల్ హిట్స్ ఇచ్చాడు, మరి వారిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రాన్ని నాని ఎందుకు కాదనుకున్నాడో తెలిసిరాలేదు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో "గ్యాంగ్ లీడర్" చేస్తున్న నాని త్వరలోనే తాను బయటకి వచ్చిన కారణం తెలుపుతాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: