అతనో పేరు మోసిన రౌడీషీటర్..ఎన్నో హత్యలు, అక్రమాలకు పాల్పడిన వ్యక్తి..ఎన్నో కేసులు అతనిపై ఉన్నాయి. అలాంటి వ్యక్తి హత్యకు గురయ్యాడు..కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో కొన్ని విస్తుతిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.  రౌడీ సునీల్‌ హత్య కేసులో కన్నడనటి ప్రియాంకతోపాటు ఆమె తల్లి నాగమ్మను చెన్నపట్టణ గ్రామీణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ప్రియాంక పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. కాగా,  జనవరి 29న ఓ ఇంట్లో సునీల్ పై మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హతమార్చారు.


ఈ హత్యలో ప్రియాంక, నాగమ్మల ప్రమేయం ఉందని నిర్ధారించిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ప్రియాంక కారు డ్రైవర్‌గా సునీల్‌ వ్యవహరిస్తుండేవాడు. ప్రియాంక అత్త కుమారుడే సునీల్‌. పలు కేసులలో నిందితుడిగా ఉన్న సునీ ల్‌ను డ్రైవర్‌ పనినుంచి తొలగించారు. దాంతో ప్రియాంకపై కక్ష్య పెంచుకున్న సునీల్ ఆమెను తరుచూ వేధించసాగాడు. 


అంతే కాదు ఈ మద్య బెదింపు కాల్స్ కూడా చేయడంతో విసిగిపోయిన ప్రియాంక అతని పీడ ఎలాగైనా వదిలించుకోవాలని చూసింది. అందుకే సునీల్ ను హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. కేసులో వీరి పేర్లు బయటకు రావడంతో, ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ హత్య కేసులో ప్రమేయం ఉందని నిర్థారణకు వచ్చిన పోలీలసులు  ప్రియాంకతో, నాగమ్మ రామనగర్ లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: