నాని  గౌతమ్ తిన్ననూరి  కాంబినేషన్‌ లో వచ్చిన ‘జెర్సీ’ ఘన విజయం వైపు దూసుకెళ్తున్ననేపధ్యంలో ఈమూవీ సక్సస్ మీట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన రానా ముఖ్య అతిథిగా వచ్చిన రానా ఈ సినిమా పై విపరీతమైన ప్రశంసలు కురిపిస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
 
తనకు తన జీవితంలో కొన్ని విషయాలు అర్ధంకావు అంటూ క్రికెట్ పెళ్లి అమ్మాయిలు పిల్లలు తనకు అర్ధంకాని విషయాలు అని అంటూ అలాంటి మనస్తత్వం ఉన్న తన లాంటి వ్యక్తికి కూడ ‘జెర్సీ’ చూసిన తరువాత ఏడుపు వచ్చిన విషయాలు వివరించాడు. ఇదే సందర్భంలో నానీతో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి వివరిస్తూ కనీసం వారంలో తాను నానీని మూడుసార్లు కలుస్తాను అంటూ తమ స్నేహాన్ని వివరించాడు. 

అయితే తాను నానిని  కలిసిన ప్రతీసారి  తనలో స్ఫూర్తిని నింపుతాడు అన్న విషయాన్ని వివరిస్తూ ప్రతీ సినిమాలో కొత్తగా చేయాలని కొత్తగా కనిపించాలని ప్రయత్నంచేసే నాని వ్యక్తిత్యం తనకు ఎంతో నచ్చుతుంది అని కామెంట్స్ చేసాడు. సాధారణంగా ఏవిషయం తనను కదిలించదు అని అంటూ తనలాంటి ఒక బండ  వ్యక్తిత్యం ఉన్న వ్యక్తులను కూడ ‘జెర్సీ’ కదిలిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

ఇదే సందర్భంలో ఈమూవీలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ కు తాను అభిమానిగా మారిపోయిన విషయాన్ని వివరిస్తూ ‘జెర్సీ’ సినిమా గొప్ప చిత్రంగా శాశ్వతంగా ఉంటుంది అన్న తన అభిప్రాయాన్ని తెలియచేసాడు. ఫిలిం ఫంక్షన్స్ లో సాధరణంగా చాల తక్కువగా మాట్లాడే రానా ‘జెర్సీ’ ఫంక్షన్ లో ఇలా అనర్గళంగా మాట్లాడటం చూసిన వారు రానా స్పీచ్ కి తెగచప్పట్లు కొట్టారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: