సినిమా వాళ్ళకు ఓ సెంటిమెంట్ ఉంది. మొదటి మూవీ ఎలాంటిది వస్తే అలాంటి పాత్రే వాళ్ళకు ఆఫర్ చేస్తారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వారికి గ్లామర్ టాలెంట్ రెండూ ఉండాలి. ఎలా వాడుకుంటారన్నది ఆ నిర్మాత, డైరెక్టర్ ఇష్టం. అందం ఆరబోయాలి. తెర మీద శ్రుంగార దేవత కావాలి. అంతే మరి.


ఇపుడున్న హీరోయిన్ల కధలన్నీ ఇవే. అయితే కమర్షియల్ మూవీస్ లో నటిస్తే నాలుగైదు ఆఫర్లు వెంటవెంటనే వస్తాయి కానీ నటిగా టాలెంట్ నిరూపించుకోలేమని అంటోంది రాశీఖన్నా.  అవకాశం వస్తే ప్రయోగాత్మక సినిమాల్లో నటించి నా ప్రతిభాసామర్థ్యాలు ఏమిటో నిరూపించుకోవాలనుంది అని అంటోంది పంజాబీ వయ్యారి రాశీఖన్నా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉంది. అయితే తన సత్తాకు తగిన పాత్రలు లభించడం లేదని ఒకింత నిరుత్సాహాన్ని వ్యక్తం చేసింది. 


తాను  ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో నటించానని, అందుకే నా ప్రతిభ వెలుగులోకి రాలేదని అనుకుంటున్నానని చెబుతోంది.  అయితే తమిళంలో ఇమైక్క నోడిగల్ అడంగమరు చిత్రాల్లో తన  అభినయానికి మంచి మార్కులు పడ్డాయని మురిసిపోతోంది. ఒకే తరహా పాత్రలు చేయడం తనకు ఇష్టం లేదని అంటోంది.


ఇక ముందు ప్రయోగాత్మక ఇతివృత్తాల్ని ఎంచుకోవాలనుకుంటున్నాను. దర్శకులు నా కోసం మంచి పాత్రల్ని డిజైన్ చేస్తారనుకుంటున్నాను అని రాశి  చెప్పింది. ప్రస్తుతం ఈ సుందరి తమిళంలో విశాల్ సరసన అయోగ్య (తెలుగు టెంపర్ రీమేక్) చిత్రంలో నటిస్తున్నది. తెలుగులో వెంకీమామ చిత్రంలో నటిస్తున్నది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కూడా రాశీఖన్నా కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ గ్లామర్ తారకు బోలెడు ఆశలు ఉన్నాయి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: