టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో నిఖిల్ ఒకడు.  33 ఏళ్ళ వయసులో కూడా తనకింకా పెళ్ళి వయసురాలేదంటున్నాడు ఈ కుర్రాడు. పెళ్ళి మీద తనకి ఇంకా పూర్తి అవగాహన లేదని, ఎప్పుడైతే అవగాహన కలుగుతుందో అప్పుడే పెళ్ళిచేసుకుంటానని చెప్తున్నాడు నిఖిల్,  అయితే తనకి కాబోయే భార్య ఎలా ఉండాలనే దానిపై కొన్ని ఉహలున్నాయని చెప్పుకొచ్చాడు నిఖిల్. 
"ఫిదా" సాయిపల్లవిలా బోల్డ్ గా తన వ్యక్తిత్వాన్ని చాటుకునే అమ్మాయి అంటే తనకు చాలా ఇష్టమని, అలాంటి అమ్మాయిని తన జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు నిఖిల్.  ప్రస్తుతం "అర్జున్ సురవరం" సినిమా ప్రమోషన్స్ లో ఉన్న నిఖిల్ విలేకర్లతో ముచ్చటిస్తూ సరదాగా తన పెళ్ళి గురించి ఇలా చెప్పుకొచ్చాడు.  
ఇక గత ఏడాది కన్నడ రీమేక్ "కిరాక్ పార్టీ"తో పరాజయాన్ని చవిచూసిన నిఖిల్, ఈ ఏడాది తమిళ రీమేక్ సినిమా "అర్జున్ సురవరం"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు, అయితే టైటిల్ విషయంలో గొడవ జరగడంతో పాటు ఈ చిత్రం విడుదల కూడా అనేక మార్లు వాయిదా పడుతుండటంతో నిఖిల్ స్వయంగా ఈ చిత్ర ప్రమోషన్స్ పాత్రను భుజాన వేసుకున్నాడు. లావణ్య త్రిపాఠి కధానాయికగా నటించిన ఈ చిత్రం తాజా సమాచారం ప్రకారం మే నాలుగోవ వారంలో విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: