రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు హీరోయిన్ సమస్యలు ఒకదాని తరువాత ఒకటిగా వస్తున్నాయి. ఈసినిమా నుంచి బ్రిటీష్ బ్యూటీ డైసీ తప్పుకున్న తరువాత మళ్ళీ రాజమౌళికి హీరోయిన్స్ వేట మొదలైంది. ఇలాంటి పరిస్థుతులలో రాజమౌళికి ఒక పరిష్కారంగా కనిపించిన నిత్యామీనన్ పై బ్యాన్ విధించే ప్రయత్నాలు జరుగుతూ ఉండటం దక్షిణ భారతదేశ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది.

నిత్యామీనన్ దక్షినాది భాషలకు చెందిన అన్ని సినిమాలలోను నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమె ప్రస్తుతం రెండు మలయాళ సినిమాలలో కూడ నటిస్తోంది. అయితే ఈసినిమాల షూటింగ్ కు సరిగ్గా రాకుండా ఆ నిర్మాతలకు నిత్యామీనన్ చుక్కలు చూపిస్తున్నట్లు టాక్.

ఈవిషయమై ఆమెతో మాట్లాడాలని కొందరు నిర్మాతలు ప్రయత్నించినా ఆమె తనను కలవడానికి వచ్చిన నిర్మాతలకు కనీసం అపాయింట్ మెంట్ కూడ ఇవ్వకుండా తన ఇగోను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీనితో కోపగించుకున్న నిర్మాతలు నిత్యామీనన్ ను దక్షినాది సినిమా రంగం నుండి బ్యాన్ చేయాలి అంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన నిత్యామీనన్ తన ప్రవర్తనకు వివరణ ఇస్తూ తన తల్లికి స్టేజ్ 3 క్యాన్సర్ రావడంతో తాను సినిమాల పట్ల శ్రద్ధ పెట్టలేకపోతున్నానని వివరణ ఇచ్చింది. 

అంతేకాదు తన తల్లి ఆరోగ్యం కుదుటపడే వరకు తన డేట్స్ విషయంలో నిర్మాతలు తనను ఒత్తిడి చేయవద్దు అని కోరినట్లు తెలుస్తోంది. దీనితో నిత్యామీనన్ బ్యాన్ వ్యవహారం ఎలా ఉన్నా ఆమెతో సినిమాలు తీసేవారికి తిప్పలు తప్పవు. ఇలాంటి పరిస్థుతులలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ ను ప్రేమించే గిరిజన యువతి పాత్రకు ఎంపిక అయిన నిత్యామీనన్ పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: