రాజమౌళి ‘బాహుబలి’ ఘన విజయం తరువాత ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చే ఇంటర్వ్యూలో తన సినిమాలు ఏవీ విదేశీ సినిమాలకు అనుసరణ కాదనీ కేవలం అనుకరణ మాత్రమే అంటూ తన స్టైల్ లో వివరణ ఇచ్చాడు. అంతేకాదు ప్రపంచంలోని కొందరు రచయితలు మరికొందరు దర్శకులు ఒకే సమయంలో ఒకేలా ఒకొక్కసారి ఆలోచిస్తారనీ అందువల్ల ఆ అనుసరణ కాపీ ఎలా అవుతుంది అంటూ తన రీతిలో ఆ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేసాడు.

అయితే ఇప్పుడు మళ్ళీ రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో తన గురువు రాఘవేంద్రరావు టెక్నిక్ ను అనుసరిస్తున్నాడా అంటూ సెటైర్లు పడుతున్నాయి. దీనికి కారణం ఈమూవీలో ‘కొమరం భీం’ లాంటి చాయలు ఉన్న పాత్రను పోషిస్తున్న జూనియర్ కు ఇద్దరు హీరోయిన్స్ ను రాజమౌళి పెడుతున్నాడు. వారిలో ఒకరు బ్రిటీష్ బ్యూటీ పాత్ర అయితే మరొకరు గిరిజన యువతీ పాత్ర. 

ఇప్పుడు ఈ విషయమే రాజమౌళి పై సెటైర్లు పడేలా చేస్తోంది. 1977 ప్రాంతంలో విడుదలైన ఎన్టీఆర్ ‘అరవిరాముడు’ సినిమాలో గిరిజన యువతిగా జయసుధ నటిస్తే పట్నం అమ్మాయిగా జయప్రద నటించింది. ఆ సినిమాలో కూడ ఎన్టీఆర్ అటవీ ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయాల పై ఫారెస్ట్ ఆఫీసరుగా పోరాటం చేస్తాడు. 

ఇప్పుడు అదే లవ్ ట్రయాంగిల్ కు స్వాతంత్ర ఉద్యమ నేపధ్యం కలిపి అప్పటి అటవీ ప్రాంతాలలో బ్రిటీష్ వాళ్ళు సాగించే దమన నీతిని చూపెడుతూ దీని పై పోరాటం చేసే పాత్రలో జూనియర్ ను చూపెడుతున్నాడు. ఇలా ఒకనాటి ‘అడవిరాముడు’ యాంగిల్ లవ్ స్టోరీని తెలివిగా ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం రాజమౌళి అదే గిరిజన నేపధ్యంలో ఉపయోగించుకోవడంతో తిరిగి రాజమౌళి పై అనుసరణ సెటైర్లు పడేలా చేస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: