ప్రియమణి తెలుగులో చాలా  సినిమాలు చేసింది. అబ్బాయి జూనియర్ తో పాటు, బాబాయి బాలయ్య పక్కన నటించి గ్రేట్ అనిపించుకుంది. అందం చందం అన్నీ ఉన్న ఈ భామ జగపతి బాబుతో కలసి ప్రవరాఖ్యుడు, పెళ్ళైన  కొత్తలో వంటి మూవీస్ చేసి రొమాంటిక్ పెయిర్ అన్న పేరు కొట్టేసింది. సొలోగా కూడా కొన్ని మూవీస్ చేసిన ప్రియమణి పెళ్ళి అయిన తరువాత తగ్గించేసింది.


తెలుగులో ఓ ప్రముఖ  చానల్లో డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణికి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. రానా సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తాజా సమాచారం.వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా ఒక భారీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి 'విరాటపర్వం 1992' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఈ టైటిల్ నే ఖరారు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటించనుండగా, ఒక కీలకమైన పాత్ర కోసం 'టబు'ను తీసుకున్నారు.


ఇక మరో ముఖ్యమైన పాత్రకి గాను ప్రియమణిని తీసుకున్నారట. ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ప్రియమణికి వరుస అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇదిలా ఉండగా టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా ఉన్న ప్రియమణి మళ్లీ నటిస్తే సీనియర్లు రమ్యక్రిష్ణ వంటి వారు చేసే తరహా పాత్రలకు ఆమెను కూడా ఓ చాయిస్ గా తీసుకోవచ్చునని అంటున్నారు. మరి ప్రియమణి లక్ ఎలా ఉందో రానా మూవీతో తేలిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: