తెలుగు బుల్లితెర మీద ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన బిగ్ బాస్ - 3 సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర భాష‌ల్లో దుమ్ములేపిన బిగ్ బాస్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా మాంచి ఎంజాయ్‌మెంట్ ఇచ్చింది. తొలి సీజ‌న్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉన్నారు. ఎన్టీఆర్ ఎనర్జీ, వాక్చాతుర్యం అన్ని క‌లిసి తొలి సీజ‌న్‌ను సూప‌ర్ హిట్ చేశాయి. వాస్త‌వంగా తొలి సీజ‌న్ ఒకానొక ద‌శ‌లో డౌన్‌లోకి వెళ్లింది. కేవ‌లం ఎన్టీఆర్ ఆ షోను సింగిల్ హ్యాండ్‌తో ర‌న్ చేసి స‌క్సెస్ చేశాడ‌నే చెప్పాలి.


ఇక రెండో సీజ‌న్‌కు నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు. రెండో సీజ‌న్‌లో నాని హోస్టింగ్ క‌న్నా కంటెస్టెంట్ల మ‌ధ్య గొడ‌వ‌లు, బ‌య‌ట కంటెస్టెంట్ల గెలుపు కోసం ఆర్మీలు, కుట్ర‌లు, కుతంత్రాల‌తో రెండో సీజ‌న్ కూడా ర‌క్తిక‌ట్టింది. తొలి సీజ‌న్‌లో కంటెస్టెంట్ల మ‌ధ్య బ‌య‌ట‌కు వ‌చ్చాక పెద్ద‌గా గొడ‌వ‌లు లేవు. రెండో సీజ‌న్‌లో కంటెస్టెంట్లు బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా పెద్ద ర‌చ్చ ర‌చ్చ జ‌రిగింది.ఇక ఇప్పుడు త్వ‌ర‌లోమూ మూడో సీజ‌న్ కూడా స్టార్ట్ అవుతోంది. ఈ సీజ‌న్‌కు హోస్ట్ ఎవ‌రూ ఎవ‌రూ అనుకుంటున్న ప్ర‌శ్న‌కి తెర‌ప‌డేలా ఉంది. 


తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ -3కి హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారన్న విషయమై ఇప్పటివరకు పలువురి పేర్లు ప్రచారంలో వున్నాయి. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోను హోస్ట్ చేయ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకున్న కింగ్ నాగార్జున బిగ్ బాస్ -3కు హోస్ట్ అన్న ప్రచారం కొద్ది రోజులుగా జ‌రుగుతోంది. నాగ్ పేరు అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి ? అన్న టాక్ కూడా వ‌చ్చింది. నాగార్జున మ‌న్మ‌థుడు -2 సినిమాతో బిజీగా ఉండ‌డంతో తాజాగా న‌టుడు వెంకటేశ్ పేరు తెరమీదకు వచ్చింది. హోస్ట్ గా వెంకటేశ్ దాదాపు ఖరారైనట్టు స‌మాచారం. మ‌రి వెంక‌టేశ్ హోస్ట్‌గా బిగ్ బాస్ షో ఎలా రంజిపం చేస్తాడో ?


మరింత సమాచారం తెలుసుకోండి: