మహాభారతంలో కర్ణుడి మరణానికి 100 కారణాలు ఉన్నట్లు గా మహేష్ ‘మహర్షి’ మూవీకి ఊహించిన స్థాయిలో ఇప్పటికీ మ్యానియా ఏర్పడక పోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ‘మహర్షి’ కి నాగార్జున నానీలు కలిసి నటించిన ‘దేవావదాసు’ సినిమా సమస్యలు ‘మహర్షి’ కి శాపంగా మారడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ‘దేవదాసు’ సినిమా మూవీ బయ్యర్లకు ఆమూవీ వల్ల వచ్చిన నష్టాలను తీరుస్తానని నిర్మాత అశ్వినీ దత్ అప్పట్లో మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అశ్వినీదత్ కొందరు దేవదాసు బయ్యర్లకు లిఖిత ఎగ్రిమెంట్లు కూడ అప్పట్లో ఇచ్చినట్లు టాక్. ఇప్పుడు ఆ ఎగ్రిమేంట్ల రీత్యా తమ ‘దేవదాసు’ నష్టాలను ‘మహర్షి’ మూవీతో పూడ్చమనీ కొందరు అశ్వినీదత్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. 

అంతేకాదు పలు ఏరియాలలోని బయ్యర్లు అక్కడి లోకల్ అసోసియేషన్స్ లో తమ ‘దేవదాసు’ నష్టాలు తీరే వరకు ‘మహర్షి’ అజిల్లాలలో విడుదల చేయకూడదని ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. ఈ వ్యవహారం అంతా చినికి చినికి గాలివానగా మారే ప్రమాదం కనిపిస్తున్న నేపధ్యంలో స్వయంగా అశ్వినీ దత్ రంగంలోకి దిగి ‘దేవదాసు’ వల్ల నష్టపోయిన బయ్యర్లతో మాట్లాడి ఒక పరిష్కారం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారాలు అన్నీ ఇలా కొనసాగుతూ ఉంటే ఏ టాప్ హీరో సినిమాకు రానన్ని సమస్యలు ‘మహర్షి’ కి మాత్రమే ఎందుకు వస్తున్నాయి అంటూ అభిమానులు మధన పడిపోతున్నారు. ముగ్గురు భాగస్వాముల వ్యక్తిగత సమస్యలతో పాటు దేవిశ్రీప్రసాద్ వంశీ పైడిపల్లిల ప్రయోగాలతో నిర్మాణం పూర్తిచేసుకుని విడుదలకు రెడీ అవుతున్న ‘మహర్షి’ పై ఇంకా ఎన్ని నెగిటివ్ వార్తలు వస్తాయో తెలియక మహేష్ అభిమానులు టెన్షన్ లో ఉన్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: