ఒక టాప్ హీరో సినిమా విడుదల కాకుండానే 20 కోట్ల నష్టాలతో విడుదలకాబోతు ఉండటం ఆ హీరో ఇమేజ్ కు ఏమాత్రం మంచి చేసే విషయం కాదు. ఇప్పటికే రకరకాల నెగిటివ్ వార్తలతో విడుదలకు ముందే సతమతమైపోతున్న మహర్షి ఇమేజ్ ని మరింత దిగజార్చే విధంగా ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించిన షాకింగ్ కథనం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఆపత్రిక కథనం ప్రకారం ‘మహర్షి’ బిజినెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా 110 కోట్ల స్థాయిని దాట లేదనీ 130 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈమూవీ విడుదలకు ముందే 20 కోట్ల నష్టాలు తెచ్చుకోవడం మహేష్ ఇమేజ్ కి ఒక మరకగా మారుతుందనీ ఆపత్రిక తన కథనంలో పేర్కొంది. ఇలాంటి పరిస్థుతులు మహేష్ ‘మహర్షి’ కి ఏర్పడటానికి గల కారణం అతడి ‘భరత్ అనే నేను’ మూవీ అన్న అభిప్రాయం కూడ ఆ కథనం వ్యక్త పరిచింది.

గత సంవత్సరం విడుదలైన ‘భరత్ అనే నేను’ సూపర్ హిట్ అయినప్పటికీ ఈమూవీని కొనుక్కున్న చాలామంది బయ్యర్లు లాభాలు రాకుండా అతితక్కువ నష్టాలతో బయటపడిన విషయాన్ని ఆ కథనంలో పేర్కొన్నారు. దీని ప్రభావంతో పాటు ఈ సంక్రాంతికి విడుదలైన ‘కథానాయకుడు’ ‘వినయ విదేయ రామ’ సినిమాలు వల్ల భారీగా నష్టపోయిన బయ్యర్ల పరిస్థితి చూసిన తరువాత ‘మహర్షి’ భారీ రేట్లకు కొనడానికి వెనక్కి వెళ్ళినట్లు ఆ పత్రిక అభిప్రాయ పడింది.

ఇలాంటి పరిస్థుతులలో ‘మహర్షి’ 20 కోట్ల నష్టాలతో విడుదల అవుతూ ఉండటం మహేష్ భవిష్యత్ సినిమాల మార్కెట్ ను ప్రభావితం చేసే విషయంగా మారుతుందనీ ఆ జాతీయ మీడియా సంస్థ కామెంట్స్ చేస్తోంది. అయితే ఈమూవీ నిర్మాతలు మటుకు ఈ వార్తలను ఖండిస్తూ ‘మహర్షి’ మూవీతో తాము పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి వచ్చేసిందనీ ఈమూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా మారుతుంది అంటూ ఆపత్రిక కథనాన్ని ఖండిస్తూ కామెంట్స్  చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: