ఆ మద్య నేచురల్ స్టార్ నాని వరుస హిట్స్ తో దుమ్మురేపాడు. కానీ కృష్టార్జునయుద్దం, దేవదాస్ సినిమాలతో కాస్త డీలా పడ్డాడు. దాంతో తన తదుపరి సినిమా మంచి హిట్ సాధించాలని పట్టుదలతో ఉన్న సమయంలో  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మంచి హిట్ టాక్ తో నడుస్తుంది.  ఈ సినిమాలో నాని మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు.

ప్రేమికుడిగా, క్రికెటర్ గా మంచి తండ్రిగా అన్ని పాత్రల్లో జీవించాడని అభిమానులు, చిత్ర పరిశ్రమ సైతం మెచ్చుకుంటుంది.  ఈ సినిమా లో నానికి జోడీగా కన్నడ బ్యూటీ  శ్రద్ధా శ్రీనాథ్  నటించింది.  అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో మంది సెలబ్రెటీలు నాని నటన, గౌతమ్ తిన్నూరి దర్శకత్వాన్ని తెగమెచ్చుకుంటూ వస్తున్నారు.  తాజాగా ఈ సినిమా ప్రముఖ నటి అనుష్క చూశారట.  తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకున్నారు.

‘‘జెర్సీ’ సినిమాలోని మ్యాచ్‌ చూసిన తర్వాత నేను పొందిన అనుభూతిని వ్యక్తం చేయడానికి మాటలు ఉంటే బాగుండేదనిపిస్తోంది.  నిజంగా ఇది నాకు ఫ్యాన్ మూమెంట్ (ఇది కేవ‌లం స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌). ఇలాంటి అద్భుత‌మైన సినిమాను అందించిన నానికి, గౌత‌మ్‌కు, చిత్ర‌బృందానికి ధ‌న్య‌వాదాలు` అని అనుష్క ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా రూ.25 కోట్ల కలెక్షన్లు సాధించి ముందుకు సాగుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: