నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన జెర్సీ సినిమా మొదటి షో నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాని నటనకు అందరు ఫిదా అయ్యారు. ఏప్రిల్ 19న రిలీజైన ఈ సినిమా 11 రోజుల్లో 25.60 కోట్ల షేర్ రాబట్టింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. 


లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో నిరాశపరచిన నాని ఈ ఇయర్ జెర్సీతో హిట్ అందుకున్నాడు. ఓ పక్క విక్రం కుమార్ తో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్న నాని రీసెంట్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వి సినిమా షురూ చేశాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడని తెలిసిందే. 


నాని జెర్సీ 11 రోజుల ఏరియా వైజ్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..  


నైజాం : 8.50 కోట్లు
సీడెడ్ : 1.81 కోట్లు
ఈస్ట్ : 1.30 కోట్లు
గుంటూరు : 1.41 కోట్లు
కృష్ణా : 1.29 కోట్లు
వెస్ట్ : 0.88 కోట్లు
నెల్లూరు : 0.58 కోట్లు
ఏపీ/ తెలంగాణ : 18.01 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.08 కోట్లు
ఓవర్సీస్ : 5 కోట్లు
వరల్డ్ వైడ్ : 25.90 కోట్లు 


మరింత సమాచారం తెలుసుకోండి: