జబర్దస్త్ యాంకర్ గా అనసూయ క్రేజ్ గురించి అందరికి తెలుసు. హాట్ యాంకర్ గా ఆడియెన్స్ ను అలరిస్తున్న అమ్మడు అటు స్మాల్ స్క్రీన్ తో పాటుగా సిల్వర్ స్క్రీన్ పై కూడా అదరగొడుతుంది. క్షణం సినిమా నుండి అనసూయ సినిమాల్లో చేస్తుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా ఇంప్రెస్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు సాధిస్తుంది.


ఆల్రెడీ అనసూయ లీడ్ రోల్ లో కథనం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా ఇప్పుడు మరో మెగా ఛాన్స్ కూడా పట్టేసిందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలో అనసూయ నటించే అవకాశాలు ఉన్నాయట.  ఈ సినిమాలో అనసూయ నటించేందుకు గాను భారీ పారితోషికం అడుగుతుందట.


చిరంజీవితో నటించే ఛాన్స్ రావడమే లక్కీ కదా అయినా సరే అనసూయ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లేదంటుంది. అందుకే ఆ సినిమాకు 25 నుండి 30 కోట్ల దాకా పారితోషికం అడుగుతుందట. ఆమెకున్న క్రేజ్ చూసి నిర్మాతలు కూడా అందుకు రెడీ అవుతున్నారు. చిరు సినిమాలో అనసూయ ఏ రోల్ చేస్తుంది ఎలా అలరిస్తుంది అన్నది ఇప్పుడేమి తెలియదు.


సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: