అల‌నాటి న‌టి సిల్క్ స్మిత జీవితం ఎన్నో వివాదాల‌తో కూడి ఉంది. ఈమె జీవిత చ‌రిత్ర ఆధారంగా డ‌ర్టీ పిక్చ‌ర్ సినిమా తెర‌కెక్కింది. ఆమె జీవితం గురించి చెప్పుకోవాల్సి ఉంటే చాలా చ‌రిత్రే ఉంది. అయితే అవ‌న్నీ ఆ సినిమాలో చూపించ‌లేదు. సినిమా కేవ‌లం రెండున్న‌ర గంట‌లు మాత్ర‌మే ఉండ‌డంతో ఏదో ఓ లైన్ మాత్ర‌మే చెప్పేసి ఆపేశారు. ఇక ఆమె జీవితం గురించి తెలిసిన వారు చాలా మంది ఇప్ప‌ట‌కీ ర‌క‌ర‌కాలుగా చెపుతుంటారు. తాజాగా ఆమె గురించి ప్ర‌ముఖంగా తెలిసిన ఓ విశ్లేష‌కుడు ఆమె జీవితం గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. 


సినిమా రంగంలో ఎద‌గాల‌ని ఎన్నో క‌ల‌లు క‌ని ఈ వృత్తిలోకి వ‌చ్చిన ఆమె ఎలాంటి న‌ర‌కం చూసి ఆ త‌ర్వాత స్టార్‌గా ఎదిగిందో చూస్తే క‌న్నీళ్లు రాక‌మాన‌వు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు మండ‌లం కొవ్వ‌లికి చెందిన ఆమె సినిమాల్లో న‌టించాల‌న్న కోరిక‌తో చెన్నైకి వ‌చ్చేసింది. ఆమె అస‌లు పేరు వ‌డ్ల‌ప‌ట్ల విజ‌య‌ల‌క్ష్మి. స‌ద‌రు విశ్లేష‌కుడు మాట‌ల్లో స్మిత గురించి... ఓ సారి నేను అప‌ర్ణ గారి ఇంటికి వెళ్లాను.. అక్క‌డ ఆమె ఓ గుడ్డ‌తో ఇల్లు తుడుస్తోంది... ఆమె ఎవ‌ర‌ని అప‌ర్ణ త‌ల్లిని అడ‌గ‌గా సినిమాల మీద ఆస‌క్తితో వ‌చ్చింది... ఏదైనా క్యారెక్ట‌ర్ రోల్ ఉంటూ చూడ‌మ‌ని ఆమె చెప్పింది.


ఆ త‌ర్వాత ఆయ‌న ఓ ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ ద్వారా ఓ సినిమా ఆఫ‌ర్ ఇప్పించ‌డం... ఆ త‌ర్వాత ఆమెకు వ‌రుస‌గా ఆఫ‌ర్లు రావ‌డం మోద‌ల‌య్యాయ‌ట‌. సిల్క్‌స్మితకు టాలెంట్ ఉండ‌డం, డ్యాన్స్ బాగా చేయ‌డం, క‌ష్ట‌ప‌డే త‌త్వం, ఆమె క‌ళ్ల‌ల్లో ఉన్న ఆక‌ర్ష‌ణ శ‌క్తి ఆమెకు చాలా ఆఫ‌ర్లు వ‌చ్చేందుకు కార‌ణ‌మైంది. త‌ర్వాత పెద్ద హీరోల సినిమాల్లోనూ అవ‌కాశాలు వ‌చ్చి ప‌డ్డాయ్‌. ఆ త‌ర్వాత ఆమె పేరు సిల్క్ స్మిత‌గా మార్చేశారు. షూటింగ్ ముగిసిన త‌ర్వాత కూడా ఆమెను నిర్మాత‌లు, హీరోలు ఉంచుకుని మ‌ద్యం తాగించేవార‌ట‌... ఆ త‌ర్వాత ఆమెను అనుభ‌వించేవార‌ట‌.


చివ‌ర‌కు నిర్మాత‌లు, హీరోలు, ద‌ర్శ‌కులే కాకుండా బ‌య్య‌ర్లు, ఫైనాన్షియ‌ర్లు, క్యారెక్ట‌ర్ ఆర్టిసులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆమెను ఇష్ట‌మొచ్చిన్ట‌టు వాడుకున్నార‌ట‌. అయితే సినిమాల్లో ఎక్క‌డ ఛాన్సులు పోతాయో అన్న భ‌యంతో ఆమె వాట‌న్నింటికి త‌లొగ్గేసి... త‌న‌ను తాను అర్పించేసుకుంది. ఆ త‌ర్వాత ఓ మ‌గ‌తోడు కావాల‌ని అప్ప‌టికే పెళ్ల‌యిన రాధాకృష్ణ‌ను చేర‌దీసింది. అత‌డు ఆమె డ‌బ్బుల‌ను మొత్తం కాజేసి... ఆమెను ఆర్థికంగా దెబ్బ‌తీసి... ఆమె మాన‌సికంగా కుంగిపోయేలా చేశాడు. ఈ క్ర‌మంలోనే ఆమె చివ‌ర్లో మ‌ద్యానికి బానిస అయ్యి... ఆర్థికంగా చితికిపోయి ఆత్మ‌హ‌త్య చేసుకునే వ‌ర‌కు వెళ్లిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: