పార్వతి లోకేష్..ప్రస్తుతం తెలుగులో తల్లి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్న నటి. ఒక్కప్పుడు కన్నడలో పెద్ద హీరోయిన్ గా నటించిన పార్వతి ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.  దాదాపు తెలుగులోని యువ హీరో-హీరోయిన్స్ అందరికి తల్లిగా నటించిన ఆవిడకి  "మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు" చేసిన పాత్రకు చాల మంచిపేరు దక్కింది.  
ఇక ఇటీవలే సోషల్ మీడియాలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కింగ్ నాగార్జున గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.  అదేంటంటే తనకు చిన్నతనం నుండి హీరోల్లో నాగార్జున అంటే చాలా ఇష్టమట, ఆయన గ్లామర్ చూసి పెళ్లంటూ చేసుకుంటే నాగార్జున లాంటి అందగాడిని చేసుకుందామని అనుకునేవారుట, "మొదటిసారి గీతాంజలి సినిమా చూసినప్పటి నుండి నాగార్జునగారికి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను, పెళ్ళంటూ చేసుకుంటే నాగార్జునలాంటి అందగాడినే చేసుకుందామని అనుకున్నాను, అందుకే నాగ్ నాకు ఫస్ట్ క్రష్" అని చెప్పుకొచ్చారు పార్వతి లోకేష్. 
అయితే తాను ఇంతగా అభిమానించే నాగార్జునతో ఇప్పటివరకు కలిసి నటించే అవకాశం దొరకలేదట, త్వరలోనే నాగ్ తో నటించే అవకాశం కలగాలని కోరుకున్నారు. దీంతో ఆరు పదుల వయసు వస్తున్న తన ఫ్యాన్ బేస్ లో ఎలాంటి మార్పు లేదని మరోసారి నిరూపించాడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున. 


మరింత సమాచారం తెలుసుకోండి: