‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ గురించి రాజమౌళి ఈరోజు చేసిన ట్విట్ సంచలనంగామారింది. సాధారణంగా పాశ్చత్య దేశాలలో కొన్ని ముఖ్య సమస్యల పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ప్రజలనుండి ప్రజాభిప్రయం సేకరిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే పద్ధతి రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్  విషయం పై కూడ అనుసరిస్తున్నాడు. 

కొన్ని రోజులక్రితం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ చిత్రానికి టైటిల్ ‘ఆర్ ఆర్ ఆర్’ అని అనుకుంటున్నప్పటికీ ఎవరైనా సూచించే టైటిల్ ఇంతకన్నా బాగుంటే అదే టైటిల్ను ఖరార్ చేసే ఆలోచనలలో ఉన్నట్లు లీకులు ఇచ్చాడు. ఆమాటలను ఆధారంగా చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఈసినిమాకు సంబంధించి అన్ని భాషల నుండి వందల సంఖ్యలో టైటిల్స్ సూచించినట్లు రాజమౌళి తెలియచేసాడు. 

‘ఆర్ ఆర్ ఆర్’ పూర్తి టైటిల్ పంపాలని రాజమౌళి అభిమానులని అడిగిన రోజునుంచి ఇప్పటివరకు వచ్చిన చాలా టైటిల్స్ లో కొన్నింటిని ఈరోజు బయటపెడుతూ వాటిలో ఉత్కంఠ రేకెత్తించే విధంగా మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని కామెంట్ చేసాడు. అంతేకాదు  ‘ఎవరికి తెలుసు మీరు పంపిన టైటిలే ఎంపిక కావచ్చు’ అని కామెంట్ చేయడంతో అభిమానులలో మరింత ఉత్సాహం పెరిగింది. 

ఇప్పటివరకు అభిమానులు పంపిన టైటిల్స్ లో కొన్నింటిని రాజమౌళి తన ట్విట్ ద్వారా బయటపెట్టాడు ‘రఘుపతి రాఘవ రాజా రామ్’  ‘రాముడు రుద్రుడు రణరంగం’ ‘రాయల్ ర్యాంపేజ్ ఆఫ్ రెబల్స్’  ‘రణమున రగిలిన రుధిరం’  ‘రామ రాజ్య రక్షక’  ‘రైజ్ రోర్ రివోల్ట్’ లాంటి అనేక టైటిల్ రాజమౌళి బయట పెట్టాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ స్వాతంత్రోద్యమ సినిమా కాబట్టి అన్ని భాషల ప్రజలను సులువుగా కనెక్ట్ చేయగల ‘రఘుపతి రాఘవ రాజా రామ్’  మంచి స్పందన వస్తోంది. ఇక రానున్న రోజులలో ఇలా ఇంకా ఎన్ని మంచి క్యాచింగ్ టైటిల్స్ బయటకు వస్తాయో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: