మరో 22 రోజులలో వెల్లడి కాబోతున్న ఎన్నికల ఫలితాలలో ‘జనసేన’ కు ఎన్ని సీట్లు వస్తాయో క్లారిటీ లేకపోయినా ‘జనసేన’ వర్గాలను మాత్రం ఒక సినిమాకు సంబంధించిన వార్తలు ఆశ్చర్య పరుస్తున్నాయి. తమిళ దర్శకుడు సముద్ర పేరు ఎరుగని వారుండరు. 

ఈ సీనియర్ దర్శకుడు గతంలో చాల సెంటిమెంట్ సినిమాలను తీసి విజయాలు అందుకున్నాడు. ఇతడు తీసిన సినిమాలలో ‘సింహరాశి’ ‘పంచాక్షరి’ సినిమాలు మంచి విజయాలను కూడ అందుకున్నాయి. ప్రస్తుతం ఇతడు యంగ్ డైరెక్టర్స్ హవాను తట్టుకోలేక సినిమాలు తీసే విషయంలో బాగా వెనకపడి ఉన్నాడు.

ఇలాంటి పరిస్థుతులలో ఈ తమిళ దర్శకుడు తెలుగులో ఒక సినిమాను తీయడానికి ప్రయత్నిస్తూ రిజస్టర్ చేసిన ‘జైసేన’ టైటిల్ జనసైనికులను మాత్రమే కాకుండా పవన్ అభిమానులకు కూడ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనికితోడు ఈసినిమా కథ వర్తమాన రాజకీయ అంశాల చుట్టూ ఉంటుంది అని ఈ దర్శకుడు లీకులు ఇస్తున్న నేపధ్యంలో ఇతడు తీయబోతున్న పొలిటికల్ మూవీ ఏమిటి అన్న కోణంలో పవన్ అభిమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. 

ఎన్నికలు పూర్తి అయిపోయి ఫలితాలు కూడ వచ్చిన తరువాత ఇప్పుడు సముద్ర తీసే పొలిటికల్ మూవీ వల్ల ప్రయోజనం ఏముంటుంది అంటూ మరికొందరు ఆశ్చర్య పోతున్నారు. ఒకవేళ నిజంగానే పవన్ ‘జనసేన’ సిద్ధాంతాలను స్పూర్తిగా తీసుకుని సముద్ర ఒక పొలిటికల్ మూవీని తీసినా దానివల్ల ‘జనసేన’ కు వచ్చే ప్రయోజనం ఏమిటి అంటూ పవన్ అభిమానులు కూడ నిట్టూర్పులు విడుస్తున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: