సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను ఏపీలో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌ప్ప మిగ‌తా అంత‌టా విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.  కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది.  ఇక ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సెన్సార్ బోర్డు మూవీ విడుదలను నిలిపేసిన విషయం తెలిసిందే. 


అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాపై ప్రతిరోజూ ఏదో ఒక ఇష్యూ జరుగుతూ వస్తుంది.  అన్ని చిక్కులను దాటి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో మే 1న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుందని వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నాడు.  గతంలో కోర్టు.. పోలింగ్ పూర్తయిన తరువాత సినిమాను విడుదల చేయొచ్చని ఉత్తర్వులు ఇవ్వడంతో రిలీజ్ కి ఏర్పాట్లు చేసుకున్నారు.  అయితే ఇప్పుడు దీనికి ఎలెక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగుతాయని చెప్పడంతో వర్మ ఫైర్ అవుతున్నారు.  


గ‌తంలో ఏపీ హైకోర్టు తీర్పుతో పాటు ఈసీ ఇచ్చిన లేఖ‌ని జ‌త చేసిన వ‌ర్మ న్యాయ ప‌రంగా ఈ విష‌యంపై పోరాడ‌తాన‌ని త‌న ట్వీట్‌లో తెలిపాడు. కాని మ‌ళ్ళీ ఈ మూవీ విడుద‌ల‌కి అడ్డుప‌డ‌డంతో ఇలా ఎవ‌రు చేస్తున్నారో..ఆ పెద్ద మనిషి ఎవరో అంద‌రికి తెలుసంటూ వ‌ర్మ త‌న ట్వీట్‌లో ఆవేద‌న వెళ్ళ‌బుచ్చాడు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించాడు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: