సాధారణంగా ఇండస్ట్రీలో కొన్ని సార్లు ఒక హీరో కోసం ఎంచుకున్న కథ అనూహ్యంగా వేరే హీరో నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సూపర్ హిట్ చిత్రాలు ముందుగా తమ వద్దకు రావడం...ఏవో కారణాల వల్ల ఆ చిత్రం వారు రిజక్ట్ చేయడం..తర్వాత వేరే హీరో ఆ చిత్రంలో నటించి మంచి హిట్ అందుకోవడం చూస్తూనే ఉన్నాయి. 

ఇలాంటి చిత్రాలు స్టార్ హీరోల విషయాల్లోనే ఎక్కువగా జరిగాయి.  తాజాగా జెర్సీతో మంచి హిట్ అందుకున్న నాని ప్రస్తుతం మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో నటిస్తున్నాడు.  ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చక చకా సాగుతుంది. జెర్సీ' సినిమాకి సంబంధించిన హడావిడి పూర్తికావడంతో, విక్రమ్ కుమార్ సినిమాపై నాని పూర్తి దృష్టి పెట్టనున్నాడు. 

వాస్తవానికి ఈ చిత్రం నాని కన్నా ముందు విక్రమ్ ప్రిన్స్ మహేష్ బాబు కు వినిపించారట.  కానీ మహేష్ మాత్రం ఈ చిత్రం కథ బాగున్నా బాడీ లాంగ్వేజ్ కి ఆ కథ సెట్ కాదనీ, ఆ తరహా పాత్రలో తనని చూడటానికి ఆడియన్స్ ఇష్టపడరని మహేశ్ బాబు అన్నాడట. మరి ఈ చిత్రం నానికి ఎంత వరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: