యువ కధానాయకుడు నిఖిల్ సిద్దార్థ ఏ క్షణాన "అర్జున్ సురవరం" చిత్రం మొదలుపెట్టారో కానీ, ఈ చిత్రానికి నిఖిల్ పడినంత కష్టం మరే సినిమాకి పడుండడు. అసలే గత ఏడాది "కిరాక్ పార్టీ"తో భయంకర ఫ్లాప్ ని చవిచూసిన నిఖిల్, తమిళ్ లో సూపర్ హిట్ అయిన "కణితన్ " ను "అర్జున్ సురవరం" గా రీమేక్ చేశాడు. 

సినిమా అయితే పూర్తి చేసాడు కానీ, సినిమాని విడులా మాత్రం చేయలేకపోతున్నాడు..ఈ సినిమా పడినన్ని వాయిదాలు నిఖిల్ కెరీర్ లో మరే సినిమాకి పడలేదు. మొన్నటివరకు గ్రాఫిక్ వర్క్ కారణంగా సినిమా వాయిదా వేశారు. ఆ తర్వాత రీషూట్స్ వల్ల మరోసారి వాయిదాపడింది. ఆ తర్వాత "జెర్సీ" , "ఎవెంజర్స్ ఎండ్ గేమ్" వల్ల మరోసారి ఈ సినిమా వాయిదా పడింది. 

అయితే మే మొదటి వారంలో సినిమాని విడుదల చేద్దాం అనుకున్న అనూహ్యంగా "మహర్షి" మే కి మారడంతో, "మహర్షి" విడుదలకు 9 రోజులు గ్యాప్ ఇచ్చి "అర్జున్ సురవరం" థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. దీంతో ఈ సారికి మే 17 డేట్ ని సినిమాని లాక్ చేసింది చిత్ర బృందం. 

మొదట్లో టైటిల్ విషయంలో వివాదాలు, ఇప్పుడు రిలీజ్ లో వాయిదాలు వల్ల "అర్జున్ సురవరం" పై జనాల్లో ఆసక్తి సన్నగిల్లింది, అయితే ఈ సారి కూడా వాయిదా పడితే ఈ సినిమాని ఇక జనాలు పట్టించుకునే అవకాశాలు తక్కువ, మరి మే 17న ఈ చిత్రం విడుదలై జనాలని అక్కట్టుకుంటుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: