ప్రపంచంలో హాలీవుడ్ మూవీస్ కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.  భారీ పెట్టుబడులు..రిచ్ గా సినిమాలు తీయడం చూస్తుంటాం.  అయితే ఆ భారీ బడ్జెట్ కి తగ్గట్టు గానే వసూళ్లూ కూడా రాబడుతుంటాయి.  ఈ మద్య హాలీవుడ్ సినిమాలు తెలుగు లో డబ్ అవుతూ మంచి వసూళ్లే సాధిస్తున్నాయి.  ఈ మద్య రిలీజ్ అయిన అవేంజర్స్ - ది ఎండ్ గేమ్ సినిమా వసూళ్లు బీభత్సం సృష్టిస్తున్నాయి.  ఈ నెలలో మజిలీ, జెర్సీ, కాంచన 3 సినిమాలు రిలీజ్ అయినా వాటిని బీట్ చేస్తూ అవేంజర్స్ మంచి వసూళ్లు సాధిస్తుంది. 

శుక్రవారం భారత్‌లో విడుదలైన ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లో రూ. 189.70 కోట్లు వసూలు చేసింది. 2016లో విడుదలైన జంగిల్ బుక్ భారత్‌లో రూ.188 కోట్లు వసూలు చేయగా.. ఆ మూవీ లైఫ్ టైం కలెక్షన్లను అవేంజర్స్ నాలుగు రోజుల్లోనే దాటేయడం విశేషం.  భారత్‌లో రూ.300 కోట్లు వసూలు చేసిన తొలి హాలీవుడ్ మూవీగానూ అవేంజర్స్: ఎండ్‌గేమ్ నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ మూవీ మన దేశంలో రూ.400 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని కూడా కొందరు ట్రేడ్ అనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.

ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా బారి ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ సినిమా క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదు. ఇప్పటికే 8000 కోట్ల కలెక్షన్స్ ను అవెంజర్స్ దాటేసింది. అయితే సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ ఈ సినిమాకోసం భారీ పారితోషికాన్ని అందుకున్నాడు. వెంజర్స్ అన్ని సిరీస్ లలో రాబర్ట్ మెయిన్ లీడ్ లో కనిపించాడు. ఎండ్ గేమ్ కోసం రాబర్ట్ సుమారు 524 కోట్ల (75 మిలియన్ల డాలర్లు) రెమ్యునరేషన్ ని అందుకున్నాడట. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా కలెక్షన్స్ నుంచి వాటా రూపంలో ఈ భారీ ఎమౌంట్ రాబర్ట్ కి అందినట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: