ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ క్రష్ అనేది చాలా రొమాంటిక్. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఎంతటి సెలబ్రెటీలైనా తమ జీవితంలో ఫస్ట్ క్రష్‌ కు గురికాకుండా ఉండరు. కొందరు మాత్రం వాటి గురించి ఓపెన్‌ గా చెప్పేస్తుంటారు. 


ముదురు హీరోయిన్ కాజల్ అలాంటిందే. ఆమె ఇటీవల ఓ  ఇంటర్వ్యూలో తన ఫస్ట్ క్రష్ గురించి ఓపెన్ అయ్యారు. ఇంతకీ కాజోల్ మనసు గెలిచిన ఆ అందగాడు ఎవరో తెలుసా.. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. 

తనకు వయస్సొచ్చిన మొదట్లో.. అక్షయ్ కుమార్ అంటే పడి చచ్చిపోయేదట. అతనంటే చచ్చేంత ఇష్టం అని చెబుతోంది. ఆయన హెన్నా సినిమా ప్రీమియర్ లో ఆయన వస్తారేమో అని ఎదురుచూసిందట. రాకపోయేసరికి నిరాశపడిందట. 

ఓ దశాబ్దం పాటు హీరోయిన్‌గా ఊపేసిన కాజల్.. ఇప్పడు కూడా తన వయస్సుకు తగ్గపాత్రల్లో రాణిస్తోంది. హీరో అజయ్ దేవగన్ను 1994లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా హుషారుగా సినిమాల్లో నటిస్తోంది. యాడ్ ఫిల్మ్స్ లోనూ సందడి చేస్తోంది కాజల్. అవును మరి మనసు రొమాంటిక్ అయితే.. అంతా ఆనందమేగా. 



మరింత సమాచారం తెలుసుకోండి: